ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సమష్టిగా రాణించింది.
అయితే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా ఓటమిని శాసించింది. ముఖ్యంగా ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్ అవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆదిల్ రషీద్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి తిలక్ వర్మ మిడిల్ స్టంప్‌ను లేపేసింది. ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన తిలక్ మూల్యం చెల్లించుకున్నాడు. గత మ్యాచ్‌లో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన తిలక్ వర్మ.. ఆదిల్ రషీద్ ధాటికి వికెట్ పారేసుకున్నాడు. ఈ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40), అభిషేక్ శర్మ(14 బంతుల్లో 5 ఫోర్లతో 24) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం పుణే వేదికగా జరగనుంది.