For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: తెలుగోడిని ఊరిస్తున్న వరల్డ్ రికార్డ్!

టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20‌ల సిరీస్ భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ శతకం సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో తిలక్ వర్మ ఈ ఫీట్ సాధించాడు.

సౌతాఫ్రికా పర్యటనలో మూడు, నాలుగో టీ20లో శతకాలు సాధించిన తిలక్ వర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెఘాలయతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున సెంచరీ సాధించాడు. దాంతో టీ20 ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సెంచరీలు బాదిన ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్రకెక్కాడు.

IND vs ENG Tilak Varma Eyes World Record In 1st T20I against England With Century

సౌతాఫ్రికా పర్యటనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరి మూడో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో చెలరేగాడు. అదే జోరును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ చూపెట్టాడు. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగే తొలి టీ20లోనూ తిలక్ వర్మ.. మూడో స్థానంలో బ్యాటింగ్ దిగే అవకాశం ఉంది. అదే జరిగితే బ్యాటింగ్ అనుకూలంగా ఉండే ఈడెన్ గార్డెన్స్ వికెట్‌పై తిలక్ వర్మ మూడెంకల స్కోర్ అందుకుంటే.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కనున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా వరుసగా మూడు శతకాలు నమోదు చేయలేదు. 2022లో ఫ్రాన్స్ బ్యాటర్ గస్టన్ మెక్‌కీన్ స్విట్లర్జాండ్, నార్వేపై వరుసగా శతకాలు బాదాడు. అదే ఏడాది సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసౌ భారత్, బంగ్లాదేశ్‌పై వరుసగా శతకాలు సాధించాడు. 2023లో ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌పై వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు. గతేడాది సంజూ శాంసన్ వరుసగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాపై సెంచరీలు నమోదు చేశాడు. తిలక్ వర్మ సౌతాఫ్రికా వరుసగా 107 నాటౌట్, 120 నాటౌట్ సెంచరీలు అందుకున్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లను దూరంగా ఉంచారు. ఇప్పటికే తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో టీ20ల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

Story first published: Tuesday, January 21, 2025, 18:43 [IST]
Other articles published on Jan 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+