Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: 93 ఏళ్లలో ఇదే తొలిసారి..!

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు సరికొత్త రికార్డ్‌ను నమోదు చేశారు. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ సిరీస్‌లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు 500+ రన్స్ చేశారు. 1932లో టెస్ట్ క్రికెట్ మొదలు పెట్టిన భారత్ ఇప్పటి వరకు 300 పైగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. కానీ తాజా ఇంగ్లండ్ పర్యటనలోనే ముగ్గురు భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా 500 ప్లస్ రన్స్ చేశారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌లో ఈ ఫీట్ సాధించలేదు. 24 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడిన సచిన్.. ఒక్క టెస్ట్ సిరీస్‌‌లో కూడా 500 ప్లస్ రన్స్ చేయలేదు. 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్ 51 శతకాలతో 15921 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి సచిన్‌కు సాధ్యం కానీ ఫీట్‌ను శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తాజా సిరీస్‌లో సాధించారు.

IND vs ENG Three Indian Batters Score 500 Runs Each in a Single Test Series for First Time in 93 Years

టాప్ స్కోరర్‌గా శుభ్‌మన్ గిల్..

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 10 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 147, 8, 269, 161, 16, 6, 12, 103, 21, 11‌లతో 754 పరుగులు చేశాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను అధిగమించాడు. కేఎల్ రాహుల్ 10 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 42, 137, 2, 55, 100, 39, 46, 90, 14, 7‌లతో 532 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 10 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 11, 25*, 89, 69*, 72, 61*, 20, 107*లతో 516 పరుగులు సాధించాడు.

తొలి భారత బ్యాటర్‌గా..

భారత్ తరఫున 6వ స్థానం లేదా అంత కంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జడేజా నిలిచాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల వీవీఎస్ లక్ష్మణ్ రికార్డ్‌ను అధిగమించాడు. అంతేకాకుండా ఓ టెస్ట్ సిరీస్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో గ్యారీ సోబెర్స్, ఇయాన్ బోతమ్, జాక్వస్ కల్లీస్‌లు రవీంద్ర జడేజా కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.

Story first published: Saturday, August 2, 2025, 22:41 [IST]
Other articles published on Aug 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+