IND vs ENG:22 రోజులు ఇలాగే ఉంటే.. భారత్ 4-0 లేదా 3-1 తేడాతో సిరీస్ గెలుస్తుంది! సునీల్ గవాస్కర్ జోస్యం!!

నాటింగ్‌హామ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) వచ్చినప్పటినుంచి ప్రతి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగానే సాగుతోంది. టాప్ జట్లయితే విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో టీ20లకు సమానంగా అభిమానులు టెస్టులను కూడా ఆధరిస్తన్నారు. డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ భారత్-ఇంగ్లండ్ సిరీస్ ద్వారా ప్రారంభం అవుతుంది.
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ ఆరంభం అయింది. ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోహ్లీసేన ఈ సిరీస్‌ను 4-0 లేదా 3-1 తేడాతో కోహ్లీసేన గెలుస్తుందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.

భారత్ 4-0తో సిరీస్ గెలుస్తుంది
తొలి టెస్ట్ టాస్ సమయంలో స్టార్ కామెంటేటర్, టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'నా అంచనా ప్రకారం ఈ పర్యటనలో భారత్ 4-0 తేడాతో సిరీస్ గెలుస్తుంది. ఇక్కడి వాతావరణం భారత్‌కు అనుగుణంగా ఉంది. 25లో 22 రోజులు ఎండ బాగా ఉంటే.. కోహ్లీసేన సిరీసు గెలవడం ఖాయం. ఒకవేళ వాతావరణం మారినట్లయితే.. అప్పుడు భారత్ 3-1తో విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటింగ్ కూడా బలహీనంగా ఉంది. ఇది కూడా నా అంచనాకు ఓ కారణం. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ ఎలా ఆడిందో మనం చూశాం' అని అన్నాడు.

కోహ్లీ అనుభవం సంపాదించాడు
'2018తో పోలిస్తే ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మూడేళ్లు వయసు పెరిగాడు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడేళ్లు అనుభవం సంపాదించాడు. 28-33-34లో బ్యాట్స్‌మన్‌లు గరిష్ట స్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతా. విరాట్ కోహ్లీ 2018లో విజయం సాధించినట్లు నేను నమ్ముతున్నా. విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్ పరుగుల దాహంతోనే ఉంటారు. వారు పరుగులు చేసే విధానమే బిన్నంగా ఉంటుంది. గొప్ప ఆటగాళ్లు ఆడిన బంతిని మర్చిపోయి తర్వాతి బంతిపైనే దృష్టి సారిస్తారు. ఈ సిరీస్లో కోహ్లీ రాణిస్తాడు' అని సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు.

నమ్మకం లేకుంటే.. మరొకరిని తీసుకోవచ్చు
'అంతర్జాతీయ క్రికెట్లో చేతేశ్వర్ పుజారా ఒక పద్ధతికి అలవాటు పడ్డాడు. ఆ విధానాన్నే అతడు నమ్ముతున్నాడు. జట్టు యాజమాన్యానికి ఆ పద్ధతిపై నమ్మకం లేకుంటే.. మరొకరిని తీసుకోవచ్చు. కానీ పుజారా విధానం టీమిండియాకు విజయాలను అందించింది. ఒక ఎండ్‌లో గోడలా పుజారా ఉన్నాడనే ధైర్యంతో మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ సులువుగా పరుగులు చేస్తున్నారు' అని సన్నీ తెలిపారు. ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పుజారా ఒక్క శతకమూ చేయలేదు. 30 సగటుతో మాత్రమే పరుగులు చేయడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. అందుకే గవాస్కర్ అతడికి అండగా నిలబడ్డాడు.

రాహుల్‌లే బెటర్
'శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్‌ను ఓపెనింగ్ చేయించాలని సన్నీ సూచించాడు. 'మూడు రోజుల మ్యాచులో రాహుల్ శతకం చేశాడు. ఓపెనర్‌గా అతడే మెరుగు. 2019 సీజన్లో మయాంక్ అదరగొట్టిన మాట నిజమే. కానీ ఆసీస్ పర్యటనలో అతడు ఇబ్బంది పడ్డాడు. శతకం చేయడం వల్ల రాహుల్ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. 2018లో ఇంగ్లండ్‌లో అతడు టెస్టు శతకం చేసిన సంగతి మర్చిపోవద్దు' అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. సన్నీ సూచించినట్టే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రాహుల్‌ను తీసుకున్నాడు. ఐదుగురు బ్యాట్స్‌మన్, కీపర్‌తో బరిలోకి దిగాలని సన్నీ చెపుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IND vs ENG:ఇంగ్లండ్‌దే బ్యాటింగ్..ఓపెనర్‌గా కేఎల్ రాహుల్!అశ్విన్ ఔట్!హైదరాబాద్ ప్లేయర్‌కు దక్కని చోటు!