ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా.. రెండో టెస్ట్‌కు సిద్దమైంది. సాగర తీరం విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. రెండో టెస్ట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, టీమ్ కాంబినేషన్స్‌పై కసరత్తులు చేస్తున్నాయి.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఓవైపు గాయాల బెడద టీమిండియాను వేదిస్తుండగా.. మరోవైపు టీమ్ కాంబినేషన్ తలనొప్పిగా మారింది. ముఖ్యంగా స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వైజాగ్ పిచ్‌పై ఎలాంటి వ్యూహాలు రచించాలనేది టీమిండియాకు సవాల్‌గా మారింది.

ఓటమెరుగని భారత్..:
అయితే విశాఖ గడ్డపై టీమిండియాకు తిరుగులేదు. ఈ మైదానంలో ఆడిన రెండు మ్యాచ్ల్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో 2016లో ఒక మ్యాచ్ ఆడగా.. భారత్ 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ(161, 81) రెండు ఇన్నింగ్స్‌ల్లో సత్తా చాటాడు. అశ్విన్ (5, 3) 8 వికెట్లతో రాణించాడు.
సౌతాఫ్రికాతో 2019లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే విశాఖ గడ్డపై టీమిండియాకు తిరుగులేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
పిచ్ రిపోర్ట్..:
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు టెస్ట్‌లు జరగ్గా.. స్పిన్నర్లు 36.04 సగటుతో 47 వికెట్లు తీసారు. పేసర్లు 32.86 యావరేజ్‌తో 23 వికెట్లు పడగొట్టారు.
రెండుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక్కడ యావరేజ్‌గా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 479గా ఉంది. టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.