Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng Practice Match: మోర్గాన్‌‌కు రెస్ట్.. ఓపెనర్‌గా రాహుల్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!

Ind vs Eng T20 World Cup Practice Match Toss: India Won The Toss Bowling First

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021‌కు సన్నాహకంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గతంలో ఫీల్డింగ్ చేసి విజయం సాధించామని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే రిపీట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వస్తాడని, తాను నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తానని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ తర్వాత ఇయాన్ మోర్గాన్ విశ్రాంతివ్వాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించిందని ఇంగ్లండ్ తాత్కాలిక సారథి జోస్ బట్లర్ తెలిపాడు.

భారత్ కఠినమైన జట్టని, పైగా ఆ దేశ ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆడి నేరుగా టోర్నీలో పాల్గొంటున్నారని చెప్పాడు. మెగా టోర్నీకి ముందు ఈ సన్నాహక మ్యాచ్‌ను అన్ని విధాలుగా వాడుకుంటామని చెప్పాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో తుది జట్ల వివరాలు వెల్లడించలేదు. ఇరు జట్లు తమ బెస్ట్ కాంబినేషన్‌ను ఎంచుకోవడానికి ఈ సన్నాహక మ్యాచ్‌ను వాడుకోనున్నాయి.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తీ

ఇంగ్లండ్: జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, సామ్ బిల్లింగ్స్

Story first published: Monday, October 18, 2021, 19:30 [IST]
Other articles published on Oct 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+