Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కేఎల్ రాహుల్ భారీ సిక్సర్? జాడలేకుండా పోయిన బంతి!(వీడియో)

IND vs ENG T20 World Cup Practice Match: KL Rahul Hits 6 Out Of Ground In Jordan Over

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) దుమ్మురేపాడు. చూడ ముచ్చటైన షాట్లతో కనువిందు చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన రాహుల్.. అదే జోరును కొనసాగించాడు. ఈ సన్నాహక మ్యాచ్‌లో ఓపెనర్‌గా అవకాశం అందుకున్న రాహుల్.. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో తనదైన క్లాస్ షాట్‌తో సిక్స్ బాదిన రాహుల్.. క్రిస్ జోర్డాన్ వేసిన 6వ ఓవర్‌ నాలుగో బంతిని స్ట్రైట్‌గా సూపర్ సిక్స్ కొట్టాడు. తన స్లాట్‌లో పడ్డ బంతిని మైదానం బయట పడేశాడు. ఈ షాట్‌కు మైదానంలో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు టీవీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ షాట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇక రాహుల్ జోరుకు ఇషాన్ కిషన్ కూడా తోడవడంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 59 రన్స్ చేసింది. అనంతరం మోయిన్ అలీ బౌలింగ్‌లో 4, 6 బాదిన రాహుల్ .. మార్క్ వుడ్ వేసిన 9వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే జోరులో మరుసటి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విరాట్ కోహ్లీ(2 బ్యాటింగ్) రాగా.. ఇషాన్ కిషన్(32 బ్యాటింగ్‌) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 85 రన్స్ చేసింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. మొయిన్ అలీ(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), జానీ బెయిర్ స్టో(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా లియామ్ లివింగ్ స్టోన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(0/54), రాహుల్ చాహర్(1/43) తేలిపోగా.. మహమ్మద్ షమీ(3/40) మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు. జస్‌ప్రీత్ బుమ్రా(1/26) ఓ వికెట్ తీయగా.. అశ్విన్(0/23) కట్టడిగా బౌలింగ్ చేశాడు.

Story first published: Monday, October 18, 2021, 22:18 [IST]
Other articles published on Oct 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+