Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: బేఫికర్ - హిట్ మ్యాన్ ఫిట్ అండ్ ఫైన్..!!

 IND vs ENG, T20 World Cup 2022: Rohit Sharma confirms he is fit and available for the Semifinal


మెల్‌బోర్న్:
టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ మ్యాచ్ ఆడబోతోంది. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అదృష్టం కొద్దీ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌కు అతి పెద్ద అడ్డంకిగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

రెండో సెమీఫైనల్..

రెండో సెమీఫైనల్..

రెండో సెమీ ఫైనల్ గురువారం షెడ్యూల్ అయింది. అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్‌ మ్యాచ్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. తొలి సెమీ ఫైనల్ విజేతతో ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్‌లో తలపడుతుంది.

రోహిత్ చేతికి గాయంతో..

రోహిత్ చేతికి గాయంతో..

ఇంగ్లాండ్ సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తమౌతోన్న భారత క్యాంప్‌లో కలకలం చెలరేగింది. రథ సారథి రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తోండగా.. టీమిండియా థ్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతి నుంచి వెలువడిన బంతి వేగంగా అతని కుడి చేతిని బలంగా తాకింది. దీనితో హిట్ మ్యాన్ నొప్పితో విలవిల్లాడాడు. నెట్స్ నుంచి బయటికొచ్చాడు. కొద్దిసేపు అక్కడే కూర్చుండి పోయాడు. బంతి తగిలిన చోట వాపు కనిపించింది.

విశ్రాంతి అనంతరం..

విశ్రాంతి అనంతరం..

కొంత విశ్రాంతి తరువాత రోహిత్ శర్మ మళ్లీ ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. ఇదివరకట్లా ధాటిగా ఆడాడు. ఎక్కువ సేపు నెట్స్‌లో ఉండలేకపోయాడు. నిర్దేశిత గడువు కంటే ముందే అతను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. అనంతరం భార్య రితిక సజ్దేతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. షాపింగ్ చేస్తోన్న సమయంలో కుడి చేతికి బ్యాండేజీతో కనిపించింది. ఫిజియోథెరపిస్ట్ కట్టిన ఆ బ్యాండేజ్‌తోనే సాయంత్రం వరకూ గడిపాడు.

ఫిట్ అండ్ ఫైన్..

ఫిట్ అండ్ ఫైన్..

ఇవ్వాళ రోహిత్ శర్మ మామూలుగానే ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. చేతికి బ్యాండేజీ కూడా లేదు. మునుపట్లా చురుగ్గా ప్రాక్టీస్ చేశాడు. గురువారం మధ్యాహ్నం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్స్‌కు తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు చెప్పాడు. గ్రౌండ్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్‌తో మాట్లాడుతూ కనిపించాడు. వారికి కొన్ని సూచనలు చేశాడు. రిషభ్ పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలను ఇది నిజం చేసినట్టయింది.

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను జరగనివ్వం..!!

Story first published: Wednesday, November 9, 2022, 10:42 [IST]
Other articles published on Nov 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+