Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను జరగనివ్వం..!!

IND vs ENG, T20 World Cup 2022, 2nd Semifinal: I dont want India-Pakistan final says Jos Buttler

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ మ్యాచ్ ఆడబోతోంది. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అదృష్టం కొద్దీ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌కు అతి పెద్ద అడ్డంకిగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఎల్లుండి రెండో సెమీఫైనల్..

ఎల్లుండి రెండో సెమీఫైనల్..

రెండో సెమీ ఫైనల్ గురువారం షెడ్యూల్ అయింది. అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్‌ మ్యాచ్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. తొలి సెమీ ఫైనల్ విజేతతో ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్‌లో తలపడుతుంది.

 ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనివ్వం.

ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనివ్వం.

భారత్‌తో సెమీ ఫైనల్‌కు ముందు జోస్ బట్లర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్‌లో భారత్-పాకిస్తాన్ ఆడటానికి తాను ఇష్టపడట్లేదని స్పష్టం చేశాడు. తాము ఫైనల్‌లో అడుగు పెడతామనే ధీమాను వ్యక్తం చేశాడు. దీనికోసం శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశాడు. భారత్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి సర్వశక్తులను ఒడ్డుతామని తేల్చి చెప్పాడు. భారత్-పాకిస్తాన్ మధ్య ఫైనల్‌ను జరగనివ్వబోమని, టీమిండియా స్థానంలో తాము ఉంటామని పేర్కొన్నాడు.

 టీమిండియాతో ఆడటానికి..

టీమిండియాతో ఆడటానికి..

నిస్సందేహంగా భారత్ అత్యుత్తమ జట్టని జోస్ బట్లర్ కితాబిచ్చాడు. అలాంటి టీమ్‌తో టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో తలపడబోతోండటం తమను ఉత్కంఠతకు గురి చేస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ కోసం ఎగ్జయిటింగ్‌తో ఎదురు చూస్తోన్నామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా పక్కా ప్రణాళికతో ఆడగలిగితే- ఓడించగలమని, అలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకున్నామనీ చెప్పాడు.

మ్యాచ్ రోజే నిర్ణయం..

మ్యాచ్ రోజే నిర్ణయం..

ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటోన్న డేవిడ్ మలన్, మార్క్ వుడ్ గురించి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవట్లేదని జోస్ బట్లర్ అన్నాడు. మ్యాచ్ రోజు మాత్రమే- వారిని తుదిజట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై నిశ్చితాభిప్రాయానికి వస్తామని పేర్కొన్నాడు. తమ మెడికల్ టీమ్ పట్ల నమ్మకం ఉందని, వారిద్దరూ మ్యాచ్ రోజుకు ఫిట్‌‌నెస్ సాధిస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు. భారత్‌ను ఎదుర్కొనడంలో వారిద్దరూ కీలక పాత్ర పోషిస్తారని అన్నాడు.

భయపడేది లేదు..

భయపడేది లేదు..

భువనేశ్వర్ కుమార్‌ను టీ20 స్పెషలిస్ట్‌గా బౌలర్‌గా అభివర్ణించాడు జోస్ బట్లర్. తాము అతని బౌలింగ్‌కు భయపడట్లేదని, ఇదివరకు ఎదుర్కొన్న అనుభవం ఉందని గుర్తు చేశాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా గొప్ప బౌలర్‌గా పేర్కొన్నాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుందని, మంచి క్రికెటింగ్ షాట్లను ఆడుతున్నాడని జోస్ బట్లర్ చెప్పాడు. అతణ్ని అవుట్ చేయడానికి ఒక్క బంతి సరిపోతుందని వ్యాఖ్యానించాడు.

Story first published: Wednesday, November 9, 2022, 9:43 [IST]
Other articles published on Nov 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+