ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఉండనుంది. మేం మా బేసిక్స్‌కు కట్టుబడి ఆడనున్నాం. తొలి టీ20 తరహాలోనే జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటున్నాం.

గాయంతో నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. రింకూ సింగ్ కూడా మరో రెండు మ్యాచ్‌ల్లోనూ గాయం నుంచి కోలుకోనున్నాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. 'గేమ్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మెరుగ్గా రాణించడంపై ఫోకస్ పెట్టాం. ఈ పిచ్ చూడటానికి బాగుంది. బెతెల్ ఆరోగ్యం బాగాలేదు. అతని స్థానంలో జేమీ స్మిత్ జట్టులోకి వచ్చాడు. అట్కిన్సన్ స్థానంలో కేర్స్‌ను తీసుకున్నాం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి ఈ మ్యాచ్‌లోనూ చోటు దక్కలేదు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన షమీని తుది జట్టులో అవకాశం కల్పించడం లేదు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాలనే ఉద్దేశంతోనే షమీని ఆడించడం లేదు.
తుది జట్లు:
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(కీపర్), జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.