ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ కాస్త స్టిక్కీగా కనిపిస్తోంది. డ్యూ ప్రభావం కూడా ఉండనుంది. మ్యాచ్ చివర్లో తేమ ఎక్కువగా కురవనుంది. కుర్రాళ్లంతా ఈ సిరీస్ కోసం సిద్దంగా ఉన్నారు. అద్భుతంగా సన్నదమయ్యారు. ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది.

అయితే మేం మా బలాలను నమ్ముకొని బరిలోకి దిగుతున్నాం. మహమ్మద్ షమీ, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఈ మ్యాచ్ ఆడటం లేదు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసే సవాల్‌ను స్వీకరిస్తున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. 'ఈ వికెట్ చూడటానికి బాగుంది. ఇది ఓ అద్బుతమైన మ్యాచ్‌గా నిలుస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. తేమ ప్రభావం చూపనుంది. ఇదో గొప్ప మైదానం. ఈ మైదానంలో భారత్‌తో ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నాం.
ప్రతీ ఒక్కరు మంచి టచ్‌లో ఉన్నారు. మెక్‌కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతనికి ఎంతో అనుభవం ఉంది. ఈ సిరీస్‌లో మాకు సవాళ్లు ఎదురవ్వనున్నాయి. ఇరు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. సకీబ్ మహమూద్, బ్రైడన్ కార్స్, జామీ స్మిత్, రెహాన్ అహ్మద్‌లు ఆడటం లేదు.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకే ఒక్క స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడంతోనే షమీకి అవకాశం దక్కలేదని అర్థమవుతోంది.
🚨 Toss News from the Eden Gardens 🚨#TeamIndia have elected to bowl against England in the T20I series opener.
— BCCI (@BCCI) January 22, 2025
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/s8VPSM3xfT
తుది జట్లు:
ఇంగ్లండ్: బెన్ డక్కెట్, ఫిలిప్ సాల్ట్(కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకోబ్ బెతెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.