Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అందుకే ఆ ముగ్గురిని పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణే వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ‌తో పాటు వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ తుది జట్టులో చోటు కోల్పోయారు. వీరి స్థానాల్లో అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, శివమ్ దూబే బరిలోకి దిగుతున్నారని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశామని స్పష్టం చేశాడు.

రెండు మార్పులతో ఇంగ్లండ్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బౌలింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే ఈ సిరీస్‌లో మంచి వాతావరణం నెలకొంది. సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. గత మ్యాచ్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం.

IND vs ENG Suryakumar Yadav Explains Why India Three Changes In Their Playing XI in 4th T20I

మా తప్పిదాలను మేం సరిచేసుకున్నాం. ఆ మ్యాచ్ గెలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. డ్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వికెట్‌పై ఎంతో స్కోర్ డిఫెండ్ చేయవచ్చని చెప్పలేం. తేమ వస్తుందా? రాదా? అనేదానిపై కూడా క్లారిటీ లేదు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. మార్క్ వుడ్ స్థానంలో మహమూద్, స్మిత్ ప్లేస్‌లో బెతెల్‌ తుది జట్టులోకి వచ్చాడు.'అని బట్లర్ తెలిపాడు.

మూడు మార్పులతో..
మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసే సవాల్‌ను స్వీకరిస్తున్నానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మా బేసిక్స్ కట్టుబడి ఆడుతాం. గత మ్యాచ్‌లో మేం ఓటమిపాలయ్యాం. ఈ మ్యాచ్‌లో మా ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తామనుకుంటున్నాం. పిచ్ కాస్త పొడిగా ఉంది. స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యం నమోదు చేస్తేనే డిఫెండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. మహమ్మద్ షమీ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. వెన్ను నొప్పి నుంచి కోలుకోవడంతో రింకూ సింగ్‌ బరిలోకి దిగుతున్నాడు. జురెల్ బెంచ్‌కే పరిమితమవుతాడు. సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడుతున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను టీమిండియా గెలవగా.. మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. దాంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

తుది జట్లు:
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ.

ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్(కీపర్),చ బెన్ డక్కెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, జాకోబ్ బెతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహముద్.

Story first published: Friday, January 31, 2025, 18:56 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+