For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సలామ్‌రా తెలుగోడా..! తిలక్‌కు వంగి వంగి దండాలు పెట్టిన సూరీడు(వీడియో)

టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌‌కు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిదా అయ్యాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శనతో భారత్‌కు విజయాన్నందించిన సంగతి తెలిసిందే. దాంతో తిలక్ వర్మకు సూరీడు వందనం చేశాడు. విజయ లాంఛానాన్ని పూర్తి చేసిన వెంటనే తిలక్ వర్మ దగ్గరకు వెళ్లిన సూరీడు.. వంగి సలామ్ కొట్టాడు.

కెప్టెన్‌ వందనానికి తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ(55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు.

IND vs ENG Suryakumar Yadav bows down to Tilak Varma after Chennai T20I win Video

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు. భారీ సిక్స్‌లతో పాటు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే పవర్ ప్లే అనంతరం భారత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో వేగం తగ్గించి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతను కూడా వెనుదిరగడంతో 116 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో తిలక్.. టెయిలెండర్ల సాయంతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి విజయాన్నందించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. తిలక్ వర్మ బ్యాటింగ్‌కు కెప్టెన్ సూర్యతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే తిలక్ వర్మకు భారత ఆటగాళ్లు సెల్యూట్ చేశారు. తిలక్ వర్మ పోరాటాన్ని విరాట్ కోహ్లీ.. మెల్ బోర్న్‌లో ఆడిన ఐకానిక్ ఇన్నింగ్స్‌తో అభిమానులు పోలుస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్స్(17 బంతుల్లో ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మకు అండగా వాషింగ్టన్ సుందర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, January 26, 2025, 8:03 [IST]
Other articles published on Jan 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+