Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం.. వైజాగ్ టెస్ట్‌ కామెంట్రీకి దూరం!

భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గవాస్కర్ అత్తగారు పుష్పా మొహ్రోత్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే సునీల్ గవాస్కర్ హుటాహుటినా తన సతీమణి మార్షనీల్‌తో కలిసి కాన్పూర్ బయల్దేరారు.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గవాస్కర్.. ఈ వార్త తెలిసే సమయానికి విశాఖపట్టణంలోనే ఉన్నారు. రెండో టెస్ట్‌కు వ్యాఖ్యానం చేస్తున్నారు. తన అత్తగారి మరణం విషయం తెలియగానే కామెంట్రీ ఆపేసి బయల్దేరారు. ఫస్ట్ సెషన్ ముగిసిన తర్వాత గవాస్కర్‌కు ఈ వార్త తెలిపింది.

IND vs ENG: Sunil Gavaskar leaves Vizag Test commentary duty after mother-in-law dies

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్‌ సిరీస్‌కు జియోసినిమా ఇంగ్లీష్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గవాస్కర్.. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు కూడా కామెంట్రీ చెప్పారు. ప్రముఖ కామెంట్రీగా గుర్తింపు పొందిన గవాస్కర్.. భారత ఆటతీరును తనదైన విశ్లేషిస్తారు. సీనియర్ క్రికెటర్‌గా ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆటగాళ్ల తప్పిదాలను వివరిస్తారు.

రెండేళ్ల క్రితం కూడా గవాస్కర్ ఇదే తరహా పరిస్థితి ఎదుర్కొన్నాడు. 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో గవాస్కర్ కామెంట్రీ చెబుతుండగా.. 95 ఏళ్ల ఆయన తల్లి తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో గవాస్కర్.. తన కామెంట్రీని కొనసాగించారు.

భారత్ తరఫున 125 టెస్ట్‌లు ఆడిన గవాస్కర్.. 10122 రన్స్ చేశాడు. 108 వన్డేల్లో 3092 పరుగులు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం గవాస్కర్ అనేక బాధ్యతలు నిర్వర్తించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 74 ఏళ్ల వయసులోనూ గవాస్కర్ ఈ తరం అభిమానుల నచ్చేలా కామెంట్రీ చెబుతారు. ఆటకు సంబంధించిన టెక్నిక్ విషయాలను సాధారణ జనాలకు అర్థమయ్యేలా వివరిస్తారు.

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 93 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 179 బ్యాటింగ్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్(34), రజత్ పటీదార్(32) పర్వాలేదనిపించారు.

ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్(5 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. టామ్ హార్ట్‌లీ, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, February 2, 2024, 20:37 [IST]
Other articles published on Feb 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+