టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో కామెంట్రీ చెబుతున్న గవాస్కర్.. శుభ్‌మన్ గిల్ ఆడిన షాట్‌ను తప్పుబడుతూ విమర్శలు గుప్పించాడు.
ఒక్క చెత్త షాట్‌తో అప్పటి వరకు గిల్ పడ్డ కష్టాన్ని వృథా చేసుకున్నాడని తెలిపాడు. అసలు ఏ షాట్ ఆడుదామని అలా ఆడాడో అర్థం కావడం లేదన్నాడు. 'శుభ్‌మన్ గిల్ ఏ షాట్ ఆడాలనుకున్నాడు? గాల్లోకి ఆడాలనుకున్నాడనే విషయం మాత్రం అర్థం అవుతుంది. కానీ అతను సమర్థవంతమైన డ్రైవ్ ఆడలేకపోయాడు.

ఇప్పటి వరకు అతను పడ్డ కష్టాన్ని ఒక్క చెత్త షాట్‌తో వృథా చేశాడు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ ప్రారంభానికి ముందే శుభ్‌మన్ గిల్ షాట్ సెలెక్షన్ గురించి సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. 'శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లోనూ దూకుడుగా ఆడాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. టీ20, వన్డే క్రికెట్‌తో పోల్చితే టెస్ట్ క్రికెట్ కాస్త భిన్నంగా ఉంటుంది.
ఎర్ర బంతి వైట్ బాల్ కంటే గాల్లో ఎక్కువగా కదులుతోంది. ఆఫ్ ది పిచ్ ఎక్కువ అవుతోంది. బౌన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నింటినీ గిల్ దృష్టిలో పెట్టుకొని షాట్ ఆడాలి.'అని సునీల్ గవాస్కర్ సూచించాడు.
ఇక వెస్టిండీస్ పర్యటన నుంచి శుభ్‌మన్ గిల్ విఫలమవుతూనే ఉన్నాడు. యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో గిల్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడిస్తున్నారు. అప్పటి నుంచి అతను వరుసగా విఫలమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 22 పరుగులే చేసి వెనుదిరిగాడు. గిల్ ఆట తీరును మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా తప్పుబట్టాడు.
'ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో గిల్ నేర్చుకోవాలి. ఒకవేళ తను నంబర్ 3లోనే కొనసాగాలని కోరుకుంటే.. ముఖ్యంగా భారత్ పిచ్‌లపై వన్‌డౌన్‌లో రాణించాలంటే.. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలి. లేదంటే స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఫోకస్ పెట్టాలి.
తొలి రోజు బాగా ఆడిన గిల్.. రెండో రోజు మాత్రం చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. పుజారా, ద్రవిడ్‌లా వన్‌డౌన్‌లో సత్తా చాటాలంటే గిల్ స్ట్రైక్ రొటేట్ చేయాల్సిందే. స్పిన్ బౌలింగ్‌ను మణికట్టును ఎక్కువగా ఉపయోగించాలి. షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాలి.'అని కుంబ్లే సూచించాడు.