Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బ్యాటర్‌గానే ఒక్క సెంచరీ చేయలేదు.. కెప్టెన్‌గా ఏం చేస్తాడో?

ఐపీఎల్ 2025 సీజన్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున ఆడేందుకు సిద్దమయ్యారు. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. ఈ టూర్‌తోనే శుభ్‌మన్ గిల్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతల చేపట్టనున్నాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 ఎడిషన్‌కు తెరలేవనుంది. అయితే ఈ పర్యటనకు ముందు శుభ్‌మన్ గిల్ ఓవర్‌సీస్ రికార్డ్స్ అభిమానులను కలవరపెడుతున్నాయి. స్వదేశంలో సెంచరీల మోత మోగించిన గిల్.. విదేశాల్లో మాత్రం ఆస్థాయిలో రాణించలేకపోయాడు.

ఒక్క సెంచరీ లేదు..
ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ విదేశాల్లో 15 టెస్ట్ మ్యాచ్‌ల్లో 28 ఇన్నింగ్స్‌లు ఆడి 27.53 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు. పసికూన బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్.. సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతను చేసిన 91 పరుగులే అత్యధిక స్కోర్. డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో ఇంగ్లండ్ గడ్డపై తొలి మ్యాచ్ ఆడిన శుభ్‌మన్ గిల్.. ఇప్పటి వరకు అక్కడ 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 57 పరుగులే చేశాడు. ఇందులో అత్యధిక పరుగులు 28. స్వింగ్ బౌలింగ్‌ను ఆడటంలో ఇతర భారత బ్యాటర్ల తరహాలోనే శుభ్‌మన్ గిల్ కూడా తడబడుతాడు.

IND vs ENG Shubman Gill s Batting Records in England Ahead of Five-Test Series

18 ఇన్నింగ్స్‌లు.. 592 పరుగులు..
డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ ఇంగ్లండ్ గడ్డపై శుభ్‌మన్ గిల్‌కు తొలి మ్యాచ్. ఇందులో గిల్ 28, 8 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ ఆడిన శుభ్‌మన్ గిల్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 17, 4తో దారుణంగా విఫలమయ్యాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో 10 మ్యాచ్‌ల్లో 18 ఇన్నింగ్స్‌లు ఆడి 37 సగటుతో 592 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. భారత గడ్డపై గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ రాణించాడు. సొంతగడ్డపై చెలరేగే శుభ్‌మన్ గిల్.. విదేశాల్లో మాత్రం తేలిపోయాడు. కనీసం ఇప్పుడైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటర్‌గానే రాణించలేని గిల్.. కెప్టెన్‌గా ఏం రాణిస్తాడేమోనని నిట్టూరుస్తున్నారు.

Story first published: Saturday, June 7, 2025, 16:25 [IST]
Other articles published on Jun 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+