Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అంపైర్‌తో శుభ్‌మన్ గిల్ వాగ్వాదం.. ఆజ్యం పోసిన సిరాజ్!

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహనం కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. రెండో రోజు ఆట తొలి సెషన్‌లో బంతి మార్పు విషయంలో ఫీల్డ్ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ వాదనను అంపైర్ పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. సిరాజ్ మరింత ఆజ్యం పోసాడు. బంతి ఆకారం సరిగ్గా లేదని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలు వినిపించుకోని అంపైర్.. వెళ్లి బౌలింగ్ చేయాలని సూచించాడు. దాంతో సిరాజ్ కోపంతో బౌలింగ్ వేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత రూల్స్ ప్రకారం భారత్ కొత్త బంతిని అందుకుంది. అయితే 10 ఓవర్లు పూర్తయ్యేసరికే బంతి ఆకారం దెబ్బతిన్నది. భారత ఆటగాళ్ల ఫిర్యాదులో బంతిని పరిశీలించిన అంపైర్ మరో బాల్‌ను తెప్పించాడు. 10 ఓవర్లు మాత్రమే ఆడిన బాల్ తీసుకొచ్చాడు. అయితే ఈ బంతి పాతదానికి కంటే మరి ఘోరంగా ఉండటంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయాన్ని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేయగా.. అతను వినిపించుకోలేదు. దాంతో మరింత అసహానానికి గురైన గిల్.. అంపైర్‌తో గొడవపడ్డాడు. అతనికి సిరాజ్ కూడా తోడయ్యాడు. టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సైతం బంతులు త్వరగా ఆకారం కోల్పోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.

IND vs ENG Shubman Gill Mohammed Siraj Blast Umpirae Over Dukes Ball Quality During Lord s Test

'మీరు ఆ బంతిని చూడండి. అది 10 ఓవర్లు ఆడించిన బంతి కాదు. 20 ఓవర్ల పాటు ఉపయోగించిన బంతి'అని తన వ్యాఖ్యానంలో అంపైర్లు తీరును తప్పుబట్టాడు. ఈ సిరీస్‌లో డ్యూక్ బాల్స్ ఉపయోగిస్తుండగా.. వీటి నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యాక ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. పదే పదే భారత ఆటగాళ్లు బంతిని మార్చాలని రిక్వెస్ట్ చేయడంతో అంపైర్ ఎట్టకేలకు బంతిని మార్చాడు.

నిప్పులు చెరిగిన బుమ్రా..

251/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దిమ్మతిరిగే షాకిచ్చాడు. వరుస ఓవర్లలోనే మూడు వికెట్లు తీసాడు. అతని ధాటికి బెన్ స్టోక్స్(44) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. సెంచరీ హీరో జోరూట్(104) బిత్తరపోయాడు.క్రిస్ వోక్స్(0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 20 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. జెమీ స్మిత్(42 బ్యాటింగ్) ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేయడంతో అతను బ్రైడన్ కార్స్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు.

Story first published: Friday, July 11, 2025, 17:31 [IST]
Other articles published on Jul 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+