For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కేఎల్ రాహుల్ సలహాను పట్టించుకోని శుభ్‌మన్ గిల్!

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్‌లో దారుణంగా విఫలమై భారీ స్కోర్ సమర్పించుకుంది. టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చేసిన తప్పిదాలు ఇంగ్లండ్‌కు కలిసొచ్చాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కొత్త బంతిని సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు ఇవ్వకుండా అన్షుల్ కంబోజ్‌కు ఇచ్చి ఘోర తప్పిదం చేశాడని, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ఆలస్యంగా బంతిని అందించాడని క్రికెట్ విశ్లేషకులు శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు గుప్పించారు. అతని బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్ స్పాటాన్ లేవని, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని దుమ్మెత్తిపోసారు.

మైదానంలో రాహుల్ ఒంటెత్తు పోకడ కూడా టీమిండియాకు నష్టం చేసిందని అభిప్రాయపడ్డారు. ఓ రివ్యూ విషయంలో కేఎల్ రాహుల్ సలహాను పాటించకుండా శుభ్‌మన్ గిల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఇది అతని ఏకపక్ష నిర్ణయాలకు ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మూడో రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బంతి జోరూట్ ప్యాడ్లను తాకింది. భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రివ్యూ తీసుకోవాలని పట్టుబట్టారు. బంతి బౌన్స్ అవ్వలేదని, స్టంప్స్‌ను కచ్చితంగా తాకుతుందని వాదించారు.

IND vs ENG Shubman Gill Ignores KL Rahul s DRS Advice Wasting India s Review on Joe Root

అదే సమయంలో అనుభవం కలిగిన రాహుల్.. బంతి ఎత్తు సమస్య కాదని, జోరూట్ క్రీజు బయట మూడు మీటర్ల దూరంలో నిలబడి ఆడాడని చెప్పాడు. అది నాటౌట్ అని, రివ్యూ వద్దని సూచించాడు. కానీ రాహుల్ మాటలను పట్టించుకోని శుభ్‌మన్ గిల్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో రాహుల్ చెప్పినట్లుగానే జోరూట్ క్రీజు బయట ఉండి ఆడాడు. దాంతో అంపైర్ నాటౌట్ ఇవ్వగా భారత్ ఓ రివ్యూ కోల్పోయింది. రాహుల్ మాట విని ఉంటే రివ్యూ మిగిలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్‌గా వెనుదిరిగారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడటంతో నాలుగో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లకు 86 పరుగులు చేసింది.

అంతకుముందు 544/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 141) సెంచరీతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/134) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/112), వాషింగ్టన్ సుందర్(2/107) రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Saturday, July 26, 2025, 20:29 [IST]
Other articles published on Jul 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+