ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. సాధారణంగా ఈ పిచ్ తొలి గంట బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. ఈ మ్యాచ్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. మేమంతా ఫిట్‌గా ఉన్నాం. గత మ్యాచ్ తర్వాత చాలా తక్కువ సమయం మాత్రమే లభించింది. అయినా మేం చాలా ఫ్రెష్‌గా ఉన్నాం. లార్డ్స్‌లో ఆడటం అందరికీ ఇష్టం. ఈ మ్యాచ్‌ను ఆస్వాదించాలి. తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు.'అని బెన్ స్టోక్స్ తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు. 'వాస్తవానికి ఈ ఉదయం నేను కాస్త గందరగోళానికి గురయ్యాను. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అయితే నేను ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాడిని. తొలి సెషన్‌లో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం ఉంటుంది. గత మ్యాచ్‌లో అందరూ రాణించారు. బౌలర్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై 20 వికెట్లు తీయడం సులువైన పనికాదు. మేం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. ప్రసిధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. బుమ్రా కోసం ప్రసిధ్‌ను తుది జట్టులో నుంచి తప్పించాల్సి వచ్చిందన్నాడు.

తుది జట్లు:
భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్