Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అందుకే బుమ్రా, కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం లేదు: శుభ్‌మన్ గిల్

ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవర్‌కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఓవర్‌కాస్ట్ కండీషన్స్‌ అడ్వాంటేజ్‌గా మారనున్నాయి. గత వారం మేం మెరుగైన ప్రదర్శన చేశాం. ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టెస్ట్‌ల్లో మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్‌ కండిషన్స్ అర్థమవుతాయి. గత మ్యాచ్‌లో మేం గొప్ప లక్ష్యాన్ని చేధించాం. గొప్ప టెస్ట్‌లో భాగమై అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. గతం గత: ఈ వారం మెరుగైన ప్రదర్శన చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతను టాస్ ఓడిపోయాడు. తుది జట్టులో మూడు మార్పులు చేశామని చెప్పిన గిల్.. లోయరార్డర్‌ బ్యాటింగ్ బలహీనమవుతుందనే కుల్దీప్ యాదవ్‌ను తీసుకోలేదన్నాడు. లార్డ్స్ టెస్ట్ ఆడించాలనే ఉద్దేశంతో బుమ్రాను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచామని చెప్పాడు.

IND vs ENG Shubman Gill Explains Kuldeep Yadav Jasprit Bumrah s Absence from 2nd Test vs England
Photo Credit: X (twitter)

'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. తొలి రోజు వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. బుమ్రా ఈ మ్యాచ్ ఆడటం లేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే అతనికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చాం. మాకు మంచి విశ్రాంతి లభించింది. ఇది మాకు కీలకమైన మ్యాచ్. కానీ మూడో టెస్ట్ లార్డ్స్ వేదికగా జరగనుంది. అక్కడి పరిస్థితులు బుమ్రా బౌలింగ్‌‌కు అనుకూలంగా ఉంటాయి. దాంతో బుమ్రాను లార్డ్స్‌లో ఆడించాలనుకున్నాం. కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించాలనుకున్నాం. కానీ గత మ్యాచ్‌లో మా లోయరార్డర్ అంత మెరుగైన ప్రదర్శన చేయలేదు. దాంతోనే బ్యాటింగ్‌లో డెప్త్ ఉండాలని భావించాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రిస్ వోక్స్, జోష్ టోంగ్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్.

భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ.

Story first published: Wednesday, July 2, 2025, 15:30 [IST]
Other articles published on Jul 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+