For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ఓపెనర్! (వీడియో)

టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అయ్యర్.. ఫీల్డింగ్‌‌లో మాత్రం తన మార్క్ చూపించాడు. అతని స్టన్నింగ్ రన్నింగ్ సూపర్ డైవ్ క్యాచ్‌కు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్‌ ‌క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) నిరాశగా పెవిలియన్ చేరాడు. అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు జాక్ క్రాలీ బిత్తరపోయాడు. ఆశ్చర్యంగా చూస్తూ మైదానాన్ని వీడాడు.

అక్షర్ పటేల్ వేసిన 23వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్.. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌పై ఫుల్లర్‌గా వేయగా.. జాక్ క్రాలీ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి గాల్లోకి లేవగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్2లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్.. 14 మీటర్ల దూరం పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రేయస్ అయ్యర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు.

IND vs ENG: Shreyas Iyer takes stunning catch to dismiss Zak Crawley in Vizag Test

18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను షాట్ మిడాన్‌లో శుభ్‌మన్ గిల్ నేలపాలు చేశాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకునే ప్రయత్నం చేసినా చిక్కలేదు. ఈ అవకాశంతో చెలరేగిన జాక్‌క్రాలీ హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీ‌తో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్‌లీకి ఓ వికెట్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జాక్‌ క్రాలీ వికెట్ అనంతరం జోరూట్(5)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 123 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఓలీ పోప్(21 బ్యాటింగ్)‌తో పాటు జానీ బెయిర్‌స్టో(10 బ్యాటింగ్) ఉన్నారు. 27 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

Story first published: Saturday, February 3, 2024, 14:12 [IST]
Other articles published on Feb 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+