టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తడబాటు కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్ ఠాకూర్(4) తీవ్రంగా నిరాశపరిచాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకమవుతాడని భావించిన శార్దూల్ ఠాకూర్.. రెండు విభాగాల్లో తీవ్రంగా నిరాశపర్చి టీమిండియా కొంపముంచాడు.
బ్యాటింగ్‌లో లోయార్డర్‌లో విలువైన పరుగులు చేస్తాడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో యువ ఆల్‌రౌండ్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్‌ను ఆడించారు. కానీ అతని వైఫల్యం టీమిండియా విజయవకాశాలను ప్రభావితం చేసింది.

రెండు ఇన్నింగ్స్‌ల్లో రవీంద్ర జడేజాతో కలిసి శార్దూల్ ఠాకూర్ 50 పరుగులు జోడించినా భారత్ విజయవకాశాలు మరింత మెరగయ్యేవి. కానీ అతని వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను చేజార్చుకుంది. ఈ ప్రదర్శన నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్‌కు బదులు నితీష్ కుమార్ రెడ్డి తీసుకున్నా బాగుండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రెండో టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్‌పై వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనై శార్దూల్ బౌలింగ్‌లో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు.
90/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మిడిలార్డర్, లోయరార్డర్ వైఫల్యంతో 364 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్(247 బంతుల్లో 18 ఫోర్లతో 137), రిషభ్ పంత్(140 బంతుల్లో15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118) సెంచరీలతో రాణించారు. దాంతో తొలి ఇన్నింగ్స్ 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నమోదు చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 350 పరుగులు అవసరం కాగా.. భారత విజయానికి 10 వికెట్లు కావాలి. ఆఖరి రోజు 90 ఓవర్ల ఆట మిగిలి ఉంది. భారత బౌలర్ల ప్రదర్శనపైనే విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.