For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: రక్తమోడుతున్నా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ పేసర్.. ఆ అంకితభావానికి హ్యాట్సాఫ్‌ అంటున్న ఫాన్స్!!

IND vs ENG 4th Test: James Anderson Bowled Even With His Leg Bleeding
Anderson’s Dedication ప్యాంట్‌ రక్తంతో తడిసిపోయినా.. టార్గెట్ Kohli నే || Oneindia Telugu

హైదరాబాద్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. మోకాళ్లకు రక్తమోడుతున్నా అలానే బౌలింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్‌ 42 ఓవర్ బౌలింగ్ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు రక్తపు గాయాలతో కనిపించాడు. ఆ సమయంలో జిమ్మీ రెండు మోకాళ్ల వద్ద ప్యాంట్‌ రక్తంతో తడిసిపోయింది. గుడి మోకాలికి అయితే గాయం కాస్త పెద్దదే అయింది. అయినప్పటికీ అండర్సన్‌ మైదానాన్ని వీడలేదు. అలానే బౌలింగ్ చేశాడు. అంతేకాదు తన ఓవర్‌లను పూర్తి చేశాడు.

 జిమ్మీ.. నీ అంకితభావానికి హ్యాట్సాఫ్‌:

జిమ్మీ.. నీ అంకితభావానికి హ్యాట్సాఫ్‌:

గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ జేమ్స్ అండర్సన్ గాయపడ్డాడు. మిడాఫ్‌లో బంతిని నిలువరించే క్రమంలో అతని మోకాలికి గాయమవగా.. గాయం నుంచి రక్తం కారుతూ కనిపించింది. అయినప్పటికీ అతడు బౌలింగ్‌ని కొనసాగించాడు. అందుకు ఓ కారణం ఉంది. అప్పటికి టెస్ట్ స్పెసలిస్ట్ అజింక్య రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో.. వికెట్‌ కోసమే అండర్సన్ అలా పట్టుదలతో బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది. 2014 నుంచి కోహ్లీ, అండర్సన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. రక్తం కారుతున్నా బౌలింగ్‌ని కొనసాగించిన అండర్సన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'జిమ్మీ.. నీ అంకితభావానికి హ్యాట్సాఫ్‌' అంటూ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పుజారా బోల్తా కొట్టించిన జిమ్మీ:

ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపికగా బ్యాటింగ్ చేస్తున్న చతేశ్వర్ పుజారా (4: 31 బంతుల్లో 1x4)ని చాలా తెలివిగా జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ఫోర్త్ స్టంప్‌ లైన్‌పై అండర్సన్ విసిరిన బంతిని ఆఖరి క్షణంలో వెంటాడిన పుజారా.. వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో కీలక వికెట్ పడగొట్టి మరోసారి తన సత్తాచాటాడు. తొలిరోజు 14 ఓవర్లు బౌలింగ్ చేసిన జిమ్మీ 41 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ సిరీస్‌లోనూ కోహ్లీని రెండు సార్లు ఔట్ చేయడంతో పాటు.. భారత్ టాప్ ఆర్డర్‌ని తన స్వింగ్‌తో వణికిస్తున్నాడు. మొత్తంగా భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌటవగా.. గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 53/3తో నిలిచింది.

 పుజారా బోల్తా కొట్టించిన జిమ్మీ:

పుజారా బోల్తా కొట్టించిన జిమ్మీ:

ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపికగా బ్యాటింగ్ చేస్తున్న చతేశ్వర్ పుజారా (4: 31 బంతుల్లో 1x4)ని చాలా తెలివిగా జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ఫోర్త్ స్టంప్‌ లైన్‌పై అండర్సన్ విసిరిన బంతిని ఆఖరి క్షణంలో వెంటాడిన పుజారా.. వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో కీలక వికెట్ పడగొట్టి మరోసారి తన సత్తాచాటాడు. తొలిరోజు 14 ఓవర్లు బౌలింగ్ చేసిన జిమ్మీ 41 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ సిరీస్‌లోనూ కోహ్లీని రెండు సార్లు ఔట్ చేయడంతో పాటు.. భారత్ టాప్ ఆర్డర్‌ని తన స్వింగ్‌తో వణికిస్తున్నాడు. మొత్తంగా భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌటవగా.. గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 53/3తో నిలిచింది.

166 టెస్టుల్లో 631 వికెట్లు :

166 టెస్టుల్లో 631 వికెట్లు :

ఇంగ్లండ్ తరఫున 2003లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ అండర్సన్ ఇప్పటి వరకూ 166 టెస్టులాడి 631 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న 39 ఏళ్ల జిమ్మీ.. 31 సార్లు 5 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా, మొదటి పేసర్‌గా రికార్డు సాదించాడు. ఇప్పటికే వన్డే, టీ20లకి దూరమైన అండర్సన్.. టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. జిమ్మీ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల కంటే.. టెస్టుల్లోనే జిమ్మీ సత్తాచాటాడు. స్వింగ్ కింగ్‌గా పేరొందాడు.

ఈ సిరీసే చివరిదా?:

ఈ సిరీసే చివరిదా?:

జేమ్స్‌ అండర్సన్‌కు ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీసే చివరిదని ఇంగ్లీష్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ జోస్యం చెప్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 10న ఆరంభం కానున్న ఐదవ టెస్ట్ మ్యాచ్.. అండర్సన్‌ ఆడే చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్ ముగిసిన అనంతరం జిమ్మీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని హార్మిసన్ తెలిపాడు. అయితే ఈ విషయంపై జిమ్మీ గాని, ఈసీబీ గాని స్పందించలేదు. ఏదేమైనా 39 ఏళ్ల వయసులో కూడా జిమ్మీ వికెట్లు పడగొడుతూ.. యువకులకు తీవ్ర పోటీని ఇస్తున్నాడు. తాజాగా అతడు సొంత గడ్డపై టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, September 3, 2021, 13:33 [IST]
Other articles published on Sep 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+