For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG సెమీఫైనల్ టాస్ ఆలస్యం.. ఎందుకంటే..?

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. గయానా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌లో ఇంకా టాస్ వేయలేదు. ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా టాస్‌ మరింత ఆలస్యం కానుంది. గంట క్రితం వరకు గయానాలో భారీ వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.

ప్రస్తుతం వర్షం ఆగిపోయినా.. ఆటకు మైదానం సిద్దంగా లేకపోవడంతో అంపైర్లు టాస్ వేయలేదు. గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్దం చేస్తున్నారు. అయితే ఇక్కడ బెస్ట్ డ్రైనేజీ సిస్టమ్ ఉందని, ఆటకు ఎలాంటి అంతరాయం ఉండదని కామెంటేటర్లు తెలిపారు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. శనివారమే ఫైనల్ జరగనుండటంతో ఐసీసీ రిజర్వ్ డే కేటాయించలేదు. కానీ వెయిటింగ్ టైమ్‌ను ఏడు గంటలకు పొడిగించింది.

IND vs ENG Semi Final-2 Toss delayed due to Wet Out Field

ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలంటే ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాలి. లేకుంటే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. టీ20 ప్రపంచకప్ రూల్స్ ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్ రద్దయితే పాయింట్స్ టేబుల్‌లో ముందంజలో ఉన్న జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. తాజా మ్యాచ్ రద్దయితే ఇంగ్లండ్ కంటే ముందంజలో ఉన్న భారత్ నేరుగా ఫైనల్ చేరుతోంది.

ఒక వేళ మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగిస్తే.. అప్పటికే ఇరు జట్లు 5 ఓవర్ల ఆటను పూర్తి చేసి ఉంటే డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఫలితాన్ని తేల్చుతారు. ఆట సాధ్యమైతే ఓవర్లను కుదించి ఆడిస్తారు. వర్షం పరిస్థితుల్లో మ్యాచ్ ఆడటం ఇరు జట్లకు సవాల్‌తో కూడుకున్న విషయమే. వర్షం పరిస్థితులు, డక్‌వర్త్ లూయిస్ లెక్కలను మదిలో పెట్టుకొని ఆడాల్సి ఉంటుంది.

గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్ 2022లోనూ ఇంగ్లండ్, భారత్ సెమీఫైనల్లోనే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో పాక్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈసారి ఇంగ్లండ్ కంటే టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా కనబడుతోంది.

తుది జట్లు(అంచనా):

భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్/బెన్ డక్కెట్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్/రీస్ టోప్లీ

Story first published: Thursday, June 27, 2024, 19:52 [IST]
Other articles published on Jun 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+