For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: నోరు పారేసుకున్న మార్క్‌వుడ్.. అప్పర్‌ కట్‌తో బదులిచ్చిన సర్ఫరాజ్ ఖాన్!(వీడియో)

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ బౌలర్లు సహనం కోల్పోతున్నారు. భారత బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తుండటంతో ఔట్ చేయలేక నోటికి పని చెబుతున్నారు. రెండో రోజు ఆటలో భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌పై ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్ స్లెడ్జింగ్‌కు దిగాడు. అయితే అతని కవ్వింపులకు ఏ మాత్రం బెదరని సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు.

అదిరిపోయే అప్పర్‌కట్ షాట్‌తో బౌండరీ బాది మార్క్‌వుడ్ నోరు మూయించాడు. భారత తొలి ఇన్నింగ్స్ 76వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్క్ వుడ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని సర్ఫరాజ్ ఖాన్ బౌండరీ బాదగా.. మార్క్‌వుడ్ సహనం కోల్పోయాడు. దాంతో మరుసటి బంతిని బౌన్సర్‌గా సంధించిన మార్క్‌వుడ్‌.. సర్ఫరాజ్‌పై నోరుపారేసుకున్నాడు.

IND vs ENG Sarfaraz Khan Hits Mark Wood With A Stunning Upper Cut Four In Dharamshala Test

మార్క్ వుడ్ స్లెడ్జింగ్‌కు మౌనంగా ఉండిపోయిన సర్ఫరాజ్ ఖాన్.. మరుసటి బంతిని అప్పర్ కట్‌తో బౌండరీకి తరలించాడు. సర్ఫరాజ్ ఖాన్‌పై కోపంతో మార్క్ వుడ్ బౌన్సర్ వేయగా.. సర్ఫరాజ్ మోకాల్లపై కూర్చొని అద్భుతంగా అప్పర్ కట్ ఆడాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మార్క్‌వుడ్‌కు సర్ఫరాజ్ ఖాన్ అదిరిపోయే రితీలో బదులిచ్చాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మార్క్ వుడ్ వేసిన మరుసటి 78వ ఓవర్‌లోనూ తొలి రెండు బంతులను సర్ఫరాజ్ ఖాన్ 4, 6 బాదాడు. దాంతో మార్క్‌వుడ్ మరింత చిర్రెత్తుకుపోయాడు.

135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. ఓవర్ నైట్ బ్యాటర్లు రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103), శుభ్‌మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 171 పరుగులు జోడించారు. రోహిత్‌ను బెన్ స్టోక్స్ ఔట్ చేయగా.. శుభ్‌గిల్‌ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా ఆడారు. నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్‌(56)ను షోయబ్ బషీర్ పెవిలియన్ చేర్చాడు.నాలుగో వికెట్ కోల్పోయే సమయానికి భారత్ 376 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (79; 108 బంతుల్లో)మినహా అంతా విఫలమయ్యారు.

Story first published: Friday, March 8, 2024, 14:53 [IST]
Other articles published on Mar 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+