టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్.. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. అతని రికార్డును తాజాగా సర్ఫరాజ్ ఖాన్ సమం చేశాడు.
టీమ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో సిక్స్‌తో పాటు సింగిల్ తీసి హాఫ్ సెంచరీ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తన తండ్రివైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు సర్ఫరాజ్ తండ్రితో పాటు అతని సతీమణి హాజరైంది. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీతో ఈ ఇద్దరూ ఎగిరి గంతేసారు. సర్ఫరాజ్ తండ్రి అయితే గాల్లో ముద్దుల వర్షం కురిపించాడు. భారత ఆటగాళ్లు సైతం స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ.. సర్ఫరాజ్‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

స్వేచ్చగా షాట్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ దిశగా సాగాడు. కానీ రవీంద్ర జడేజా తప్పిదం కారణంగా సర్ఫరాజ్ ఖాన్( 66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) రనౌటయ్యాడు. అతని శతకం కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. సర్ఫరాజ్ రనౌటవ్వడంపై అతని తండ్రితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోహిత్ శర్మ అయితే తన క్యాప్‌ను నేలకు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ముందుగా రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 131) శతకం చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అండతో జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 86 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.