భారత దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కింది.
తొడకండరాల గాయంతో రవీంద్ర జడేజా, కుడి తొడ నొప్పితో కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఇద్దరిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని పేర్కొంది. ఈ ఇద్దరి స్థానాల్లో అజిత్ అగార్కర్ సారథ్యంలోని మెన్స్ సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసిందని తెలిపింది.

ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ భారత్-ఏ తరఫున ఇంగ్లండ్-ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు.
ఇన్నాళ్లు సెంచరీల మోత మోగించినా.. నిలకడగా రాణించినా అతన్ని భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు.
కేఎల్ రాహుల్ గాయపడటం.. ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్ట్‌లో సెంచరీతో చెలరేగడం అతనికి కలిసొచ్చింది. లయన్స్‌తో అతను 161 పరుగులు చేశాడు. ఇదే రోజు అతని సోదరుడు అండర్ 19 ప్రపంచకప్‌లో శతకం బాదాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 45 మ్యాచ్‌ల్లో 69.8 సగటుతో 3912 రన్స్ చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఎంపికపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తుది జట్టులో కూడా అతనికి అవకాశం ఇవ్వాలని, అవసరమైతే శుభ్‌మన్ గిల్ తప్పించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
రెండో టెస్ట్‌కు భారత్ రివైజ్డ్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్