Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రిషభ్ పంత్ సెంచరీ.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ ఇదే!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ సెంచరీపై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా స్పందించారు. ఎక్స్‌వేదికగా రిషభ్ పంత్‌తో పాటు సెంచరీలు సాధించిన శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.ఈ ముగ్గురు అద్భుతమైన సెంచరీలు నమోదు చేశారని కొనియాడాడు. రిషభ్ పంత్ సిక్సర్‌తో సెంచరీ సాధించడం భారత క్రికెట్‌ భవిష్యత్తు ప్రతిబింబిస్తుందని తెలిపాడు. ఈ సిరీస్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కిందని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

'ముగ్గురు ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌ అద్భుతమైన సెంచరీలు నమోదు చేశారు. రిషభ్ పంత్ సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకోవడం భారత భవిష్యత్తు క్రికెట్‌ను ప్రతిబింబిస్తోంది. ఈ సిరీస్‌లో ఇది అద్భుతమైన ఆరంభం'అని సంజీవ్ గోయెంకా ట్వీట్ చేశాడు.

IND vs ENG Sanjiv Goenka Praises Rishabh Pant After Record Century Against England

రూ. 27 కోట్లు పెట్టి కొంటే..

ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. మెగా వేలంలో సంజీవ్ గోయెంకా రూ. 27 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు పంత్‌ను కొనుగోలు చేశాడు. అతను మాత్రం ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులే చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. అది తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంత్ సెంచరీ చేశాడు. అదే జోరును ఇంగ్లండ్ గడ్డపై చూపించాడు.

భారత్ 471 ఆలౌట్

359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌..మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు. శుభ్‌మన్ గిల్ వికెట్ అనంతరం టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. లోయరార్డర్ బ్యాటర్లు కరుణ్ నాయర్(0), రవీంద్ర జడేజా(11), శార్దూల్ ఠాకూర్(1) తీవ్రంగా నిరాశపర్చడంతో 41 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా ధాటికి 4 పరుగుల వద్దే ఓపెనర్ జాక్ క్రాలీ(4) వికెట్ కోల్పోయింది. కానీ ఓలీపోప్, బెన్ డకెట్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ 107/1 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

Story first published: Saturday, June 21, 2025, 21:56 [IST]
Other articles published on Jun 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+