For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బజ్‌బాల్ కాదు.. అది అతని అహంకారం: మాజీ క్రికెటర్ ఫైర్

ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర విమర్శలు గుప్పించాడు. అహంకారపూరితమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు తీవ్ర నష్టం చేశాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్(23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో రోజు ఆట లంచ్ బ్రేక్‌కు 15 నిమిషాల ముందు అనవసర షాట్‌తో బ్రూక్ మూల్యం చెల్లించుకున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బ్రూక్.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న కుమార సంగక్కర.. ఇంగ్లండ్ బ్యాటర్‌పై విమర్శలు గుప్పించాడు. ఇది అనవసరమైన షాట్ అని అభిప్రాయపడ్డాడు. అసలు ఆ సమయంలో కౌంటర్ అటాకింగ్ చేయాల్సిన అవసరమే లేదన్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ఆడాల్సిన స్వీప్ షాట్‌ను పేస్ బౌలింగ్‌లో ఆడి మూల్యం చెల్లించుకున్నాడని, ఇది బజ్ బాల్ గేమ్ కాదని, అతని అహంకారానికి నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

IND vs ENG Sangakkara Criticizes Harry Brook s Reckless Dismissal as Pure Arrogance
Photo Credit: X (twitter)

అహంకారంతో..

'భారత్ ఫైన్ లెగ్ ఫీల్డర్‌ను మార్చిందనుకుంటా. హ్యారీ బ్రూక్ స్క్వేర్‌గా ఆడాలనుకున్నాడేమో.. కానీ అతని షాట్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రూక్ ఆడిన షాట్ ఏ మాత్రం స్కూప్ కాదు. స్కూప్ షాట్‌ను అతను సునాయసంగా ఆడుతాడు. ఇది స్వీప్ షాట్. సాధారణంగా స్వీప్ షాట్‌ను స్పిన్నర్‌పై ఆడుతారు. ఈ షాట్‌కు చాలా సమయం దొరుకుతుంది. లంచ్‌కు 15 నిమిషాలు ముందు కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇది తెలివి తక్కువ నిర్ణయం. బ్రూక్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బౌలర్ తెలివిగా గ్యాప్ ఇచ్చాడు. అప్పుడు బ్రూక్ ఫ్లిక్ షాట్ ఆడాల్సింది. కానీ అహంకారంతో స్వీప్ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఇది బాజ్ బాల్ కాదు. అతి విశ్వాసం కూడా కాదు. కేవలం అహంకారం మాత్రమే. కౌంటర్ అటాక్ చేయడమే పెద్ద పొరపాటు.'అని సంగక్కర విమర్శలు గుప్పించాడు.

భారత్ లక్ష్యం 193

వాషింగ్టన్ సుందర్(4/22) నాలుగు వికెట్లతో రఫ్పాడించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(96 బంతుల్లో ఫోర్‌తో 40), బెన్ స్టోక్స్(96 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో సుందర్‌కు తోడుగా జస్‌ప్రీత్ బుమ్రా(2/38), మహమ్మద్ సిరాజ్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలో వికెట్ పడగొట్టారు. దాంతో భారత్‌ ముందు 193 పరుగుల లక్ష్యం నమోదైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది.

Story first published: Sunday, July 13, 2025, 22:42 [IST]
Other articles published on Jul 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+