Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సాయి సుదర్శన్ డకౌట్.. గంభీర్ రియాక్షన్ వైరల్!

టీమిండియా అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్.. తన కెరీర్‌ను డకౌట్‌తో ప్రారంభించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో ఆరెంజ్ క్యాప్ అందుకున్న సాయి.. ఆ జోరును ఇంగ్లండ్ గడ్డపై చూపించలేకపోయాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. లెగ్ సైడ్ వేసిన బంతిని అనవసరంగా గెలికి మరీ వికెట్ పారేసుకున్నాడు. మరికాసేపట్లో ఫస్ట్ సెషన్ ముగుస్తుందనగా.. ఔటయ్యాడు. సాయి సుదర్శన్ ఔటైన తీరుపై గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గంభీర్ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

IND vs ENG Sai Sudharsan s Debut Duck Leaves Gautam Gambhir Disheartened

14 ఏళ్ల తర్వాత డకౌట్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(42 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(42) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్‌ను బ్రైడన్ కార్స్ క్యాచ్ ఔట్‌గా పెవిలియ్ చేర్చాడు. అనంతరం సాయి సుదర్శన్ క్రీజులోకి రాగా.. అతన్ని బెన్ స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. 4 బంతులు మాత్రమే ఆడిన సాయి సుదర్శన్ తీవ్రంగా తడబడ్డాడు. సాయి ఆడిన తొలి బంతికే ఇంగ్లండ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. రెండో బంతిని డాట్ చేశాడు. అతను ఆడిన మూడో బంతికి మరోసారి అప్పీల్ చేయగా.. నాలుగో బంతికి ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ వేసిన 26వ ఓవర్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల తర్వాత అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో డకౌటైన తొలి బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు.2011లో ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చివరిసారిగా అరంగేట్ర మ్యాచ్‌లో డకౌటయ్యారు.

ఏమైందయ్యా సాయి..

అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన సాయి సుదర్శన్‌పై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. సాయికి ఐపీఎల్ బౌలింగ్ వేయాలని, టెస్ట్ బౌలింగ్ కాదని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ధోనీతో పోల్చుతున్నారు. ధోనీ కూడా తన అంతర్జాతీయ కెరీర్‌ను డకౌట్‌తో ప్రారంభించి.. ఆ తర్వాత గొప్ప కెప్టెన్‌గా ఎదిగాడు. సాయి కూడా అలానే అవుతాడా? అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ శర్మ డకౌట్స్ వారసత్వాన్ని సాయి కొనసాగిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫస్ట్ సెషన్ ముగిసే సమయానికి భారత్ 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 92 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్ గిల్ ఉన్నాడు.

Story first published: Friday, June 20, 2025, 18:56 [IST]
Other articles published on Jun 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+