ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. శుక్రవారం లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ మొదలవ్వగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా చేతుల మీదుగా 23 ఏళ్ల సాయి సుదర్శన్ అరంగేట్ర టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సాయి సుదర్శన్‌కు ఈ అవకాశం దక్కింది. అరంగేట్రంతోనే సాయి సుదర్శన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జూన్ 20న అరంగేట్రం చేసిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు.
14 ఏళ్ల క్రితం 2011లో ఇదే రోజు(జూన్ 20) విరాట్ కోహ్లీ, అభినవ్ ముకుంద్, ప్రవీణ్ కుమార్‌లు వెస్టిండీస్‌తో మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఇదే జూన్ 20న ఇంగ్లండ్‌పై సౌరవ్ గంగూలీతో పాటు రాహుల్ ద్రవిడ్‌లు టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తాజాగా ఇదే రోజున సాయి సుదర్శన్ అరంగేట్రం చేయడంతో వారిలా ఈ తమిళ కుర్రాడు చరిత్ర సృష్టిస్తాడా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని టాస్ సందర్భంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. తాను నాలుగో స్థానంలో ఆడుతానని చెప్పిన గిల్.. 8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ వికెట్‌పై తొలి సెషన్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.కానీ ఆ తర్వాత ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. సూర్యుడు కూడా వచ్చాడు. కాబట్టి వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం మేం అద్భుతంగా సన్నదమయ్యాం. బెకెన్‌హమ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాం. మా కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయి సదుర్శన్ అరంగేట్రం చేస్తుండగా.. కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చాడు. సాయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. అందరూ ఊహించనట్లుగానే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు.అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది.
భారత తుది జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ