Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మంగళవారమే ఐర్లాండ్ ఫ్లైట్ ఎక్కింది. ఈ సిరీస్‌తో టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2027 రోడ్ మ్యాప్ మొదలవ్వనుంది.

టీ20 ప్రపంచకప్ 2026 గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఐపీఎల్ స్టార్లకు అవకాశం దక్కింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు సూర్యన్ష్ షెడ్గే‌లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు.

అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)

అతని కాళ్లు మొక్కి టీమిండియా జెర్సీ అందుకున్న బుడ్డోడు! (వీడియో)

వైభవ్‌కు షాకిచ్చిన సబా కరీం..

ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌తోనే అతను అరంగేట్రం చేస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ టీమిండియా వికెట్ కీపర్ సబా కరీమ్ మాత్రం వైభవ్ సూర్యవంశీ అవసరం ఇప్పుడే టీమిండియాకు లేదని అభిప్రాయపడ్డాడు.

IND vs ENG Saba Karim Predicts India s Playing XI for 1st T20I Drops Phenom Vaibhav Sooryavanshi
Photo Credit: X (twitter)

స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడే తుది జట్టును ప్రకటించిన సబా కరీమ్.. వైభవ్ సూర్యవంశీని విస్మరించాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే ఓపెనర్లుగా కొనసాగించాడు. ఇషాన్ కిషన్‌ను నెంబర్ 3లోకి తీసుకున్న సబా కరీమ్.. నాలుగో స్థానంలో నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు.

ముగ్గురు పేసర్లకు ఛాన్స్..

వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఐదో స్థానంలో తీసుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ను ఎంచుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను పేసర్లుగా ఎంచుకున్న సబా కరీమ్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీని తీసుకున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబేకు అవకాశం కల్పించాడు. వైభవ్ సూర్యవంశీని సబా కరీం విస్మరించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

వైభవ్ సూర్యవంశీ ఇన్.. సంజూ ఔట్! ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

వైభవ్ సూర్యవంశీ ఇన్.. సంజూ ఔట్! ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో తొల టీ20కి సబా కరీమ్ ఎంపిక చేసిన భారత తుది జట్టు:

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Wednesday, June 24, 2026, 19:08 [IST]
Other articles published on Jun 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+