IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్‌ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్‌తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్‌వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొమ్మిది పరుగులు చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కోహ్లీ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 35 పరుగులే చేసింది.
ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(4)ను క్రిస్ వోక్స్ షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 66 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 91 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని డేవిడ్ విల్లే విడదీసాడు.
కేఎల్ రాహుల్(39)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మ(87)ను ఆదిల్ రషీద్.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన షమీ(1) కూడా ఔటవ్వడంతో బుమ్రాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పోరాడాడు. హాఫ్ సెంచరీ ముంగిట సూర్యను విల్లే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్‌తో కలిసి బుమ్రా విలువైన పరుగులు చేశాడు. ఆఖరి బంతికి బుమ్రా రనౌటయ్యాడు.