టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ తనదైన రివ్యూతో ఫలితాన్ని రాబట్టాడు. బజ్ బాల్ బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌కు కళ్లెం వేసాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 30వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసింది. ఈ ఓవర్ ఆఖరి బంతిని సిరాజ్ ఇన్‌స్వింగర్‌గా వేయగా.. ఓలీపోప్ బీట్ అయ్యాడు. బంతి ప్యాడ్లను తాకడంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌటిచ్చాడు. ఔట్‌సైడ్ లెగ్ స్టంప్ దిశగా దూసుకెళ్తుందని అతను భావించాడు.

అయితే ఔటని భావించిన సిరాజ్ మాత్రం రివ్యూ కోసం పట్టుబట్టాడు. సిరాజ్ కోరిక మేరకు రోహిత్ సైతం రివ్యూ తీసుకున్నాడు. బాల్ ట్రాకింగ్ రిప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను తాకుతున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. ఓలిపోప్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సూపర్ రివ్యూ తీసుకున్న రోహిత్ శర్మతో పాటు సిరాజ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో తమ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. బెన్ డక్కెట్(118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) విధ్వంసకర శతకంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 207 పరుగులు చేసింది.
క్రీజులో బెన్ డక్కెట్‌తో పాటు జోరూట్(9 బ్యాటింగ్) ఉన్నాడు. జాక్ క్రాలీ(15), ఓలిపోప్(39) తర్వగా ఔటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్ తలో వికెట్ తీసారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 238 పరుగుల వెనుకంజలో ఉంది.