For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma ఓపెనర్‌గా మరో ఘనత!

IND vs ENG: Rohit Sharma Reaches 11,000 Runs As Opener In International Cricket

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో ఘనతను అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న హిట్ మ్యాన్... తద్వారా ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా భారత సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 11వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఓపెనర్‌గా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 11 వేల పరుగుల మైలురాయిని అందుకోగా... దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ (251 ఇన్నింగ్స్‌ల్లో) మూడో స్థానం, సునీల్‌ గావస్కర్‌ (258 ఇన్నింగ్స్‌ల్లో) నాలుగో స్థానంలో, గార్డన్‌ గ్రీనిడ్జ్‌ (261 ఇన్నింగ్స్‌ల్లో) ఐదో స్థానంలో నిలిచాడు.

రాహుల్‌తో కలిసి మరో రికార్డు..

రాహుల్‌తో కలిసి మరో రికార్డు..

కాగా ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు(393 పరుగులు) సాధించిన భారత ఓపెనింగ్‌ జోడిగా రోహిత్‌- రాహుల్‌ మూడో స్థానంలో నిలిచారు. ఆకాశ్‌ చోప్రా- సెహ్వాగ్‌ జోడి 459 పరుగులు(ఆస్ట్రేలియా, 2003-04) తొలి స్థానంలో ఉండగా.. చౌహన్‌-గవాస్కర్‌ జోడి 453 పరుగులు( ఇంగ్లండ్‌, 1979) రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో చౌహన్‌- గవాస్కర్‌ జోడి మూడుసార్లు చోటుదక్కించుకోవడం విశేషం. ఇక మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. 43/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా 60 ఓవర్లలో వికెట్ నష్టానికి 168 పరుగులు చేసింది. ప్రస్తుతం 69 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రోహిత్ శర్మ(80 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(42 బ్యాటింగ్) ఉన్నారు.

సెంచరీ దిశగా రోహిత్..

సెంచరీ దిశగా రోహిత్..

మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు. మరోసారి సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని జేమ్స్ అండర్సన్ విడదీశాడు. కీపర్ క్యాచ్‌గా కేఎల్ రాహుల్(46)ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఔట్ విషయంలో అంపైర్ ఔటివ్వకపోయినా.. ఇంగ్లండ్ కెప్టెన్ రివ్యూకెళ్లి ఫలితం సాధించాడు. దాంతో రాహుల్ 4 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం పుజారా క్రీజులోకి రాగా.. రోహిత్ దూకుడుగా ఆడాడు. దాంతో భారత్ 108/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ శర్మ 145 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత జోరుగా ఆడిన హిట్ మ్యాన్ సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. పుజారా(43 బ్యాటింగ్) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

ఇంగ్లండ్ 290 ఆలౌట్

ఇంగ్లండ్ 290 ఆలౌట్

ఒలీ పోప్‌ (81; 6 ఫోర్లు), క్రిస్‌ వోక్స్‌ (50; 11 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ చివరికొచ్చేసరికి అనూహ్యంగా 99 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ(50), శార్దూల్ ఠాకూర్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, September 4, 2021, 20:02 [IST]
Other articles published on Sep 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+