For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవీంద్ర జడేజాపై అరిచిన రోహిత్ శర్మ (వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై రోహిత్ శర్మ కన్నెర్ర చేశాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజా నోబాల్స్‌తో విసిగించాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఏకంగా 6 నోబాల్స్ వేసాడు. 26 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 101 పరుగులిచ్చి ఓ వికెట్ మాత్రమే తీసాడు.

జడేజా పదే పదే నోబాల్స్ వేయడంతో విసిగిపోయిన రోహిత్ శర్మ అతన్ని మందలించాడు. 'జడ్డూ నోబాల్స్ వద్దు'అని కసరించుకున్నాడు. కొంచెం వెనక్కి నుంచి వేయవచ్చు కదా? అని నెత్తిని బాదుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మూడో రోజు ఆటలో చాలా వరకు రోహిత్ శర్మ అసహనంగా కనిపించాడు.

IND vs ENG: Rohit Sharma Loses Cool After Ravindra Jadeja Repeated No balls

ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌ విషయంలో తన మాట వినని సిరాజ్‌పై కూడా రోహిత్ నోరు పారేసుకున్నాడు. ఇక 186 పరుగుల లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 316 పరుగులు చేసింది. ఓలిపోప్(208 బంతుల్లో 17 ఫోర్లతో 148 నాటౌట్) ఒక్కడే అజేయ సెంచరీతో చెలరేగాడు.

బెన్ డక్కెట్(47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఓలిపోప్‌తో పాటు రెహాన్ అహ్మద్ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఆధిక్యం 126 పరుగులకు చేరింది.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 15 పరుగులు మాత్రమే జోడించింది. రవీంద్ర జడేజా(87) సెంచరీ చేజార్చుకోగా.. అక్షర్ పటేల్(44) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఓవర్‌కాస్ట్ కండిషన్స్‌ను ఉపయోగించుకున్న ఇంగ్లండ్.. బుమ్రా(0), సిరాజ్(0)లను డకౌట్ చేసింది.

Story first published: Saturday, January 27, 2024, 18:18 [IST]
Other articles published on Jan 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+