Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కెప్టెన్ రోహిత్ శర్మ ‘సెంచరీ’

IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్.. రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 100వ మ్యాచ్. మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ కెప్టెన్‌గా సెంచరీ మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ఫార్మాట్‌లో 51 మ్యాచ్‌ల్లో టీమిండియాను నడిపించిన రోహిత్.. ఇందులో 39 సార్లు గెలిపించాడు.

అతని కెప్టెన్సీ రికార్డులో 70 శాతం విజయాలు ఉండటం గమనార్హం. టెస్ట్‌ల్లో 9 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 5 విజయాలతో పాటు 2 మ్యాచ్‌లు డ్రా చేశాడు. 2 మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి ఎదురైంది. వన్డేల్లో 38 మ్యాచ్‌ల్లో జట్టు నడిపించిన హిట్ మ్యాన్ 28 విజయాలు అందించాడు. 9 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

 IND vs ENG: Rohit Sharma joins elite list, as he will lead India for 100th time across formats

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. టాప్-3 బ్యాటర్లు శుభ్‌మన్ గిల్(9), విరాట్ కోహ్లీ(0), శ్రేయస్ అయ్యర్(4) దారుణంగా విఫలమయ్యారు. దాంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ క్రమంలో 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ.. మరో ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో కెప్టెన్‌గా 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Story first published: Sunday, October 29, 2023, 16:26 [IST]
Other articles published on Oct 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+