Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma అచ్చం సెహ్వాగ్ స్టైల్‌లో సిక్స్‌తో హిట్‌మ్యాన్ సెంచరీ!

IND vs ENG: Rohit Sharma hits first hundred outside home

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ శర్మ(205 బంతుల్లో 100 బ్యాటింగ్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో హిట్ మ్యాన్ సిక్స్‌తో శతకాన్ని అందుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన రోహిత్.. కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. ఓవరాల్‌గా అతనికిది ఎనిమిదోవ టెస్ట్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో హిట్ మ్యాన్ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 73 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. రోహిత్ 74 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ హిట్ మ్యాన్‌దే కావడం విశేషం.

హిట్ మ్యాన్‌కు జతగా చతేశ్వర్ పుజారా(48) కూడా రాణిస్తుండటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ల్లో టీ బ్రేక్ సమాయనికి వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 100 పరుగులు ధాటింది. అంతకు ముందు 43/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు. మరోసారి సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని జేమ్స్ అండర్సన్ విడదీశాడు. కీపర్ క్యాచ్‌గా కేఎల్ రాహుల్(46)ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఔట్ విషయంలో అంపైర్ ఔటివ్వకపోయినా.. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ రివ్యూకెళ్లి ఫలితం సాధించాడు. దాంతో రాహుల్ 4 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

అనంతరం పుజారా క్రీజులోకి రాగా.. రోహిత్ దూకుడుగా ఆడాడు. దాంతో భారత్ 108/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ శర్మ 145 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత కమిట్ మెంట్‌తో ఆడిన రోహిత్ శర్మ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. మరో ఎండ్‌లో పుజారా సైతం సహకారం అందించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో రోహిత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

Story first published: Saturday, September 4, 2021, 20:26 [IST]
Other articles published on Sep 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+