IND vs ENG: అమ్మ.. జర్రయితే వికెట్ పోయేది! బచాయించిన రోహిత్!(వీడియో)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తడబాటు కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోహిత్ శర్మ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను ఇంగ్లండ్ ప్లేయర్ గస్ అట్కిన్సన్ నేలపాలు చేశాడు.
జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని ఆర్చర్.. బౌన్సర్ వేయగా.. రోహిత్ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ ఆడాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి లెగ్ సైడ్ గాల్లోకి లేచింది. కానీ ఈ క్యాచ్‌ను అట్కిన్సన్ అందుకోలేకపోయాడు. క్యాచ్‌ను వదిలేయడంతో పాటు బంతిని బౌండరీలోకి నెట్టేసాడు. దాంతో వికెట్ రావాల్సిన బంతి బౌండరీకి వెళ్లిపోయింది.

5 పరుగులకే ఔటయ్యేవాడు..
ఈ క్యాచ్ డ్రాప్‌తో రోహిత్ శర్మ ఊపిరి పీల్చకోగా.. జోఫ్రా ఆర్చర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే రోహిత్ 5 పరుగులకే వెనుదిరిగేవాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తున్నారు. 'అమ్మ.. జర్రయితే వికెట్ పోయేది'అని రోహిత్ శర్మ అనుకున్నాడని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు భారత అభిమానులు కూడా ఈ క్యాచ్ డ్రాప్‌తో ఊపిరి పీల్చుకున్నారని పేర్కొంటున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. నిలకడగా బ్యాటింగ్ చేసిన ఇన్‌ఫామ్ బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(30 బంతుల్లో 6 ఫోర్లతో 31) అట్కిన్సన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
కోహ్లీ స్వేచ్ఛగా ఆడినా రోహిత్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. చివరకు విల్ జాక్స్ బౌలింగ్‌లో రోహిత్(26) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 60 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది.
తొలి వన్డేలో రోహిత్ శర్మ(11)తో పాటు విరాట్ కోహ్లీ(5) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ రాణించాల్సిన బాధ్యత వారిపై ఉంది. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ఇద్దరూ.. నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

