For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: రోహిత్ శర్మ నోట బూతు మాట..! (వీడియో)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సహచర ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. రాయలేని పదాలతో తిట్టాడు. ఫీల్డ్ సెటప్ విషయంలో తన మాట వినకపోవడం తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్.. బండ బూతులు తిట్టాడు. రోహిత్ శర్మ బూతు వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. 31వ ఓవర్‌ కుల్దీప్ యాదవ్ పూర్తి చేయగా.. తర్వాతి ఓవర్‌ను రోహిత్.. ముఖేష్ కుమార్‌కు ఇచ్చాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్లకు ఫీల్డ్ విషమై రోహిత్ పలు సూచనలు చేశాడు. వారు వినిపించుకోకపోవడంతో అసహనానికి గురైన రోహిత్.. 'గార్డెన్‌లో ఎవరెవరు తిరుగుతున్నారో.. వాళ్ల అమ్మను ****'అని హిందీలో తిట్టాడు.

IND vs ENG: Rohit Sharma caught abusing his teammates on stump mic goes Viral

ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేమ్‌లెస్ కెప్టెన్ అంటూ రోహిత్‌పై మండిపడుతున్నారు. సహచర ఆటగాళ్లపై కనీస గౌరవం లేకుంటే ఎలా? అని విమర్శిస్తున్నారు. సహచర ఆటగాళ్ల తల్లులను తిట్టే హక్కు రోహిత్‌కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతున్నారు.

రోహిత్ కూల్ కెప్టెన్ అన్న వాళ్లకు ఈ వీడియో చూపించాలని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీనే ఎంతో మంచి కెప్టెన్ అని, అతను ఆటగాళ్లకు గౌరవం ఇచ్చేవాడని గుర్తు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీ‌తో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్‌లీకి ఓ వికెట్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ధాటికి 172 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

బెన్ డక్కెట్(21), ఓలీ పోప్(23), జోరూట్(5), జానీ బెయిర్ స్టో(25), బెన్ ఫోక్స్(6) క్రీజులో నిలబడలేకపోయారు. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(17 బ్యాటింగ్)తో పాటు రెహాన్ అహ్మద్(6 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Saturday, February 3, 2024, 15:19 [IST]
Other articles published on Feb 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+