Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. గంగూలీ రికార్డ్ బ్రేక్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సౌరవ్ గంగూలీ 1877 ప్లస్ రన్స్ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీని అధిగమించాడు. దాదా మూడు ఫార్మాట్లలో కలిపి 1875 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో 34357 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(26733), రాహుల్ ద్రవిడ్(24208) రోహిత్ కన్నా ముందున్నారు. ఈ రికార్డే కాకుండా పలు ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు.

IND vs ENG: Rohit Sharma breaks Sourav Gangulys major record in third Test vs England

సునీల్ గవాస్కర్ 4 శతకాలతో టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ 3 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ల్లో రోహిత్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక శతకాలు, హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకు 50 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 8 శతకాలతో పాటు 6 అర్థశతకాలు నమోదు చేశాడు.

ఈ తరం క్రికెటర్లలో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 80 శతకాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్(49), రోహిత్ శర్మ(47), జోరూట్(46), స్టీవ్ స్మిత్(44), కేన్ విలియమ్సన్(44) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(91) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్(79) సిక్స్‌లతో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు.

మహేంద్ర సింగ్ ధోనీ(78) సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన మూడో సారథిగా నిలిచాడు. ఇయాన్ మోర్గాన్(233) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్(211), ధోనీ(211), రికీ పాంటింగ్(171) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Thursday, February 15, 2024, 14:41 [IST]
Other articles published on Feb 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+