Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ మొత్తం 7 సిక్స్‌లు బాదాడు.

మూడో సిక్స్ అనంతరం క్రిస్ గేల్‌ రికార్డును అధిగమించాడు. గస్ అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్.. సకీబ్ మహ్మూద్ వేసిన మరుసటి ఓవర్‌లో మరో సిక్స్ కొట్టాడు. మహ్మూద్ వేసిన ఐదో ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి క్రిస్ గేల్ అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించాడు.

క్రిస్ గేల్ 301 వన్డే మ్యాచ్‌ల్లో 331 సిక్స్‌లు బాదగా.. ప్రస్తుతం రోహిత్ శర్మ 337 సిక్స్‌లతో కొనసాగుతున్నాడు. హిట్ మ్యాన్ 266 వన్డేల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స్‌లు కొట్టాడు. మరో 14 సిక్స్‌లు బాదితే హిట్ మ్యాన్ అఫ్రిదిని కూడా అధిగమించనున్నాడు.

IND vs ENG Rohit Sharma Breaks Chris Gayle Of Second Most Sixes In ODIs

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోపు రోహిత్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 628 సిక్స్‌లు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119) శతక్కొట్టగా.. శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/27) రెండు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, February 9, 2025, 20:20 [IST]
Other articles published on Feb 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+