Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చేజార్చిన బర్న్స్.. బచాయించిన రోహిత్! రెండో రోజు ఇంగ్లండ్‌దే!

Rohit, Rahul steady after England take 99-run lead

ఓవల్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు బౌలింగ్‌లో దుమ్మురేపిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా.. లోయరార్డర్, లోయర్ మిడిలార్డ్ రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 99 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ(56 బంతుల్లో 2 ఫోర్లతో 20 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(41 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) ఉన్నారు. అండర్సన్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సెకండ్ స్లిప్‌లో రోరీ బర్న్స్ నేలపాలు చేశాడు. దాంతో రోహిత్ బచాయించాడు. అప్పుడు హిట్ మ్యాన్ వ్యక్తిగత స్కోర్ 6.

అంతకుముందు 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. దాంతో జోరూట్ సేన 99 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓలి పోప్(159 బంతుల్లో6 ఫోర్లతో 81), క్రిస్ వోక్స్(58 బంతుల్లో11 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బెయిర్ స్టో(37), మొయిన్ అలీ(35), డేవిడ్ మలాన్(31) కీలక భాగస్వామ్యాలు అందించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్‌కు చెరొక వికెట్ దక్కింది.

దెబ్బతీసిన ఉమేశ్..

దెబ్బతీసిన ఉమేశ్..

రెండో రోజు ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ (31), ఒవర్టన్‌ (1 )వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. ముందుగా నైట్ వాచ్‌మన్ ఓవర్టన్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత డెవిడ్ మలాన్‌ను కూడా స్లిప్ క్యాచ్‌గానే ఔట్ చేశాడు. దాంతో 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, ఓలీపోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో వరుస బౌండరీలతో దూకుడు కనబర్చగా.. శార్దూల్, ఉమేశ్ బౌలింగ్‌లోనూ ఓలీ పోప్ ధాటిగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్ 139/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

89 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్..

89 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్..

ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్ సెషన్‌‌ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. ఇక లంచ్ బ్రేక్ తర్వాత సిరాజ్.. బెయిర్ స్టోను ఔట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. 89 పరుగుల బిగ్ పార్టనర్‌షిప్‌కు తెరదించాడు. ఆ తర్వాత మొయిన్ అలీ బ్యాటింగ్‌కు రాగా.. ఓలీ పోప్ 92 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొయిన్ అలీ(35)తో కలిసి ఏడో వికెట్‌కు కీలక 71 పరుగులు జత చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా అద్భుత బంతితో విడదీశాడు. మోయిన్ అలీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ క్రీజులోకి రాగా ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను 227/7తో ముగించాడు.

క్రిస్ వోక్స్ మెరుపు హాఫ్ సెంచరీ..

క్రిస్ వోక్స్ మెరుపు హాఫ్ సెంచరీ..

ఆ తర్వాత కొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఓలిపోప్‌ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఓలీ రాబిన్సన్‌(5)ను జడేజా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ క్రిస్ వోక్స్ కొరకరాని కొయ్యాలా మారి చివరి వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సింగిల్ తీసి స్టైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన క్రిస్ వోక్స్ రనౌటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

భారత్ 191 ఆలౌట్..

భారత్ 191 ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్‌ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. హమీద్‌ (0)ను కీపర్‌ పంత్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఉమేశ్‌ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్‌ రూట్‌ (21)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కానీ ఈ శుభారంభాన్ని భారత్ బౌలర్లు కొనసాగించలేకేపోయారు. లోయరార్డర్, లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయలేక ఆతిథ్య జట్టుకు భారీ లీడ్ అందించారు.

Story first published: Saturday, September 4, 2021, 7:13 [IST]
Other articles published on Sep 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+