For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma సెంచరీ.. ముద్దులతో ముంచెత్తిన రితికా!

IND vs ENG: Ritika Sajdeh sends an adorable flying kiss to Rohit Sharma after his century

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో చాలా నిలకడగా బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్.. మొయిన్ అలీ వేసిన 64వ ఓవర్‌ ఐదో బంతికి స్టెప్ ఔటై లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. విదేశాల్లో రోహిత్‌కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 8వది. ఇక రోహిత్ సెంచరీకి డ్రెస్సింగ్ రూమ్‌లోని టీమిండియా ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అభినందనలు తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే తానే సెంచరీ చేసినంత సంతోషం వ్యక్తం చేస్తూ హిట్ మ్యాన్‌ను అభినందించాడు.

ఇక గ్యాలరీలో రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే సైతం సంతోషం వ్యక్తం చేసింది. హిట్ మ్యాన్ సెంచరీకి ఫిదా అయిన రితికా తన భర్తను ముద్దులతో ముంచెత్తింది. గ్యాలరీ నుంచి రోహిత్‌కు ఫ్లైయింగ్ కిస్స్‌లు ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రోహిత్‌కు రితికా ఇలా ముద్దులివ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో హిట్ మ్యాన్ సెంచరీ, డబుల్ సెంచరీనప్పుడు కూడా రితికా ఇలానే సెలెబ్రేట్ చేసుకుంది. రోహిత్ సైతం తన బ్యాట్‌తో రితికాకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ సంబరాలు చేసుకున్న సందర్భాలున్నాయి.

ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. తొలిసారి ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 127) నిలబడి సెంచరీతో కదంతొక్కితే... చతేశ్వర్‌ పుజారా (127 బంతుల్లో 9 ఫోర్లతో 61), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (22 బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లీ, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్‌ పంత్, శార్దుల్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్‌ శాసించే స్థితికి చేరుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన హిట్‌మ్యాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్‌ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా (246 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనతను అందుకున్న రెండో ఆటగాడిగా రోహిత్ నిలవగా.. అతని కంటే ముందు సచిన్ తెందూల్కర్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఓవల్‌లో సెంచరీ బాదిన రోహిత్.. టెస్టుల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2021లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు ఇంగ్లండ్‌ గడ్డపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Story first published: Sunday, September 5, 2021, 15:56 [IST]
Other articles published on Sep 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+