Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రిషభ్ పంత్.. ఏం గుండెరా నీది!(వీడియో)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కళ్లు చెదిరే బౌండరీతో ఔరా అనిపించాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్.. ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీ తరలించాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో స్టెప్ ఔటై.. బౌలర్ తలపై నుంచి బౌండరీ బాదాడు. పంత్ షాట్ ధాటికి బెన్ స్టోక్స్ నోరెళ్ల బెట్టాడు. ఇదెక్కడి షాట్ రా అయ్యా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ బౌండరీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'రిషభ్ పంత్.. ఏం గుండెరా అది'అని కామెంట్ చేస్తున్నారు.

బెన్ స్టోక్స్ వేసిన 53వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో క్రీజులోకి వచ్చిన పంత్.. ఎదుర్కొన్న తొలి బంతిని డాట్ చేశాడు. రెండో బంతిని అనూహ్యంగా బౌండరీ తరలించాడు. స్టెప్ ఔటైన పంత్.. బౌలర్ తలపై నుంచి బౌండరీ తరలించాడు. ఈ షాట్‌కు అవాక్కైన స్టోక్స్.. నవ్వు ఆపుకోలేకపోయాడు.

IND vs ENG Rishabh Pant Smashes Ben Stokes Bowler s Priceless Reaction Goes Viral

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో రాణించగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(90 బ్యాటింగ్) సెంచరీకి చేరువయ్యాడు. కేఎల్ రాహుల్(42) పర్వాలేదనిపించగా.. పంత్ (20 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నాడు.

కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన జైస్వాల్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.గిల్-పంత్ మధ్య భాగస్వామ్యం 50 పరుగులు పూర్తయ్యింది.

Story first published: Friday, June 20, 2025, 22:02 [IST]
Other articles published on Jun 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+