Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చెలరేగిన జడేజా.. ఇంగ్లండ్ ఆలౌట్!

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు కుప్పకూలింది. 302/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 51 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది.

ఓవర్‌నైట్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ధాటిగా ఆడి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని జోరుకు రవీంద్ర జడేజా కళ్లెం వేసాడు. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన షోయబ్ బషీర్(0), జేమ్స్ అండర్సన్‌(0)లను ఔట్ చేశాడు.

IND vs ENG: Ravindra Jadeja takes four wickets as England all-out for 353 runs in 1st innings

జో రూట్(274 బంతుల్లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/67) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, February 24, 2024, 10:58 [IST]
Other articles published on Feb 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+