Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: 20 ఓవర్లు.. రెండే బౌండరీలు!

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో(3/26) మూడు వికెట్లు తీసిన జడేజా.. కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ (3/35) మూడు వికెట్లతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా అసాధారణ ప్రదర్శనతో భారీ స్కోర్ దిశగా సాగిన ఇంగ్లండ్ 304 పరుగులకే ఆలౌటైంది.

బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. లియామ్ లివింగ్ స్టోన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), జోస్ బట్లర్(35 బంతుల్లో 2 ఫోర్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాతో పాటు మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

IND vs ENG Ravindra Jadeja Concedes Only 2 Boundaries in 20 Overs in ODI Series

అయితే ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 20 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా కేవలం రెండు బౌండరీలు మాత్రమే ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలి వన్డేలో ఒక బౌండరీ ఇచ్చిన జడేజా.. రెండో వన్డేలో మరో బౌండరీ ఇచ్చాడు. దాంతో జడేజా బౌలింగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వన్డే ఫార్మాట్‌లో 20 ఓవర్లలో రెండు బౌండరీలు మాత్రమే ఇవ్వడం ఆశామాషీ వ్యవహారం కాదని, ఇదో సంచలన రికార్డ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తొలి వన్డేలో ఒక ఓవర్ మెయిడిన్ చేసిన జడేజా.. రెండో వన్డేలోనూ ఒక ఓవర్‌ మెయిడిన్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్‌ను 13వ సారి ఔట్ చేశాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండో సారి జోరూట్‌ను జడేజానే పెవిలియన్ చేర్చాడు. జడేజా అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో టీమిండియా కమ్‌బ్యాక్ చేసి ఇంగ్లండ్‌ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది.

Story first published: Sunday, February 9, 2025, 18:29 [IST]
Other articles published on Feb 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+