Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: రవీంద్ర జడేజా అరుదైన ఘనత!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్‌గా జడేజా చరిత్రకెక్కాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టోను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా జడేజా ఈ ఘనతను అందుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో జడేజాకు ఇది 552వ వికెట్. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో జడేజా 332 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును అధిగమించాడు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 551 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

 IND vs ENG: Ravindra Jadeja breaks Javagal Srinaths record

ఇక 186 పరుగుల లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 316 పరుగులు చేసింది. ఓలిపోప్(208 బంతుల్లో 17 ఫోర్లతో 148 నాటౌట్) ఒక్కడే అజేయ సెంచరీతో చెలరేగాడు.

బెన్ డక్కెట్(47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఓలిపోప్‌తో పాటు రెహాన్ అహ్మద్ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఆధిక్యం 126 పరుగులకు చేరింది.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 15 పరుగులు మాత్రమే జోడించింది. రవీంద్ర జడేజా(87) సెంచరీ చేజార్చుకోగా.. అక్షర్ పటేల్(44) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Story first published: Saturday, January 27, 2024, 19:47 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+