మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది.
కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజాతో పాటు మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ సంచలన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. దూకుడు మీదున్న ఓపెనర్లను తమ ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 6 ఫోర్లతో 32) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ 6 ఓవరల్లోనే 50 పరుగులు చేసింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు చేసింది. క్రీజులో సెట్ అయిన తర్వాత అనవసరం తప్పిదంతో ఫిల్ సాల్ట్ వికెట్ పారేసుకున్నాడు.
మలుపు తిప్పిన ఫీల్డింగ్..
శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో రనౌట్‌గా వెనుదిరిగాడు. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా బంతిని ఆపిన అయ్యర్ వేగంగా త్రో వేసి ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హర్షిత్ రాణా మరుసటి ఓవర్‌లోనే బెన్ డకెట్..యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఇదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్(0) కీపర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 2 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆచితూచి ఆడిన జోరూల్‌ను జడేజా వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు.
ఆదుకున్న బట్లర్, జాకోబ్ బెతెల్..
ఈ పరిస్థితుల్లో జాకోబ్ బెతెల్‌తో కలిసి జోస్ బట్లర్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే అతను 58 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్(5), బ్రైడన్ కార్స్(10) నిరాశపరిచారు.
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు జాకోబ్ బెతెల్ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతన్ని జడేజానే ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆదిల్ రషీద్)8)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. సకీబ్ మహ్మూద్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.