Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: జడేజా-సాయి కళ్లు చెదిరే క్యాచ్.. సిక్సర్ కాస్త వికెట్‌గా!(వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో బౌండరీ లైన్‌పై అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో ఔరా అనిపించారు. దాంతో సిక్సర్‌ కాస్త వికెట్‌గా మారింది. జడేజా-సాయి స్టన్నింగ్ క్యాచ్‌కు జేమీ స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 80వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

IND Vs ENG Ravinda Jadeja-Sai Sudarshan s Takes A Stunning Catch Departs Jamie Smith

అసలేం జరిగిందంటే..?

ఈ ఓవర్ తొలి బంతిని ప్రసిధ్ కృష్ట ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్‌గా వేయగా.. జెమీ స్మిత్.. ఓవర్‌ డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు. అయినా వెనక్కి తగ్గని ప్రసిధ్.. మళ్లీ అదే తరహా బంతి వేసాడు.కానీ ఈ సారి స్మిత్ బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయిందని కీపర్ క్యాచ్ కోసం భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అంపైర్ స్పందించకపోవడంతో రివ్యూ తీసుకున్నారు. కానీ రిప్లేలో బ్యాట్‌‌ను బంతి తాకలేదనే విషయం స్పష్టమైంది. దాంతో భారత్ ఒక రివ్యూ కోల్పోయింది.

మూడో బంతిని కూడా ప్రసిధ్ అలానే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్‌‌‌గా వేయగా.. స్మిత్ భారీ షాట్ ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా దూసుకెళ్లిన బంతిని అక్కడే బౌండరీ లైన్‌పై ఉన్న జడేజా అద్భుతంగా అందుకున్నాడు. అయితే బౌండరీ లైన్‌పై సమన్వయం కోల్పోయిన జడేజా బంతిని లోపలికి విసిరేసాడు. అదే సమయంలో జడేజాకు దగ్గరగా వచ్చిన సాయి సుదర్శన్ ఆ బంతిని అందుకున్నాడు. దాంతో జేమీ స్మిత్(40) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్ 465 ఆలౌట్..

209/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్(106) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్(2/122) రెండు వికెట్లు తీసాడు. చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా భారీ ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. భారత ఆటగాళ్లు దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా వేసిన నోబాల్‌తో బ్రూక్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారత్ తొలి తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, June 22, 2025, 19:02 [IST]
Other articles published on Jun 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+